How to Keep House Cool in Summer: వేసవిలో ఇంటి లోపల చల్లగా ఉండాలంటే ఇలా చేసి చూడండి..
వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, ఎండ వేడికి భయపడి చాలామంది ఇంటిపట్టునే ఉండటానికి ఇష్టపడతారు. ఐతే ఇంట్లో ఏసీలు, కూలర్లు, ఫాన్లు ఉన్నా ఒక్కోసారి వేసవి తాపాన్ని తట్టుకోవడం కష్టమైపోతుంది. ఇంట్లో ఫర్నీచర్‌ను కొద్దిపాటి మార్పులు చేయడం ద్వారా ఇంట్లో చల్లని వాతావరణాన్ని సృస్టించవచ్చు..
Updated on: Apr 13, 2023 | 10:35 AM

వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, ఎండ వేడికి భయపడి చాలామంది ఇంటిపట్టునే ఉండటానికి ఇష్టపడతారు. ఐతే ఇంట్లో ఏసీలు, కూలర్లు, ఫాన్లు ఉన్నా ఒక్కోసారి వేసవి తాపాన్ని తట్టుకోవడం కష్టమైపోతుంది. ఇంట్లో ఫర్నీచర్‌ను కొద్దిపాటి మార్పులు చేయడం ద్వారా ఇంట్లో చల్లని వాతావరణాన్ని సృస్టించవచ్చు.

బెడ్ రూంలో ఉండే దుప్పట్లు సిల్క్ తరహావి కాకుండా నూలువి ఎంచుకొంటే వేడిని తక్కువగా గ్రహించి గదిని చల్లగా ఉంచుతాయి.

కిటికీలకు, తలుపులకు కుచ్చులుగా ఉండే కర్టెన్లు మందంగా ఉండటం వల్ల బయటి గాలి లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా ఇల్లు వేడెక్కే అవకాశం ఉంది. అందుకే వేసవిలో లేత రంగుల్లో ఉండే పలుచటి కర్టెన్లను ఉపయోగిస్తే లోపలికి గాలి ప్రసరించేలా చేస్తాయి.

వేసవిలో ఇంటిని చల్లగా ఉంచుకోవాలంటే.. ఇంట్లో ఇండోర్ ప్లాంట్లను అక్కడక్కడ పెంచుకోవాలి. ఇవి వేసవి తాపాన్ని తగ్గించడంతో పాటు ఇంటి లోపల ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి. కలబంద, స్నేక్ ప్లాంట్, బేబీ రబ్బర్ ప్లాంట్, గోల్డెన్ పాటోస్ వంటి ఇండోర్‌ప్లాంట్స్‌తోపాటు నీడలో పెరిగే పూల మొక్కలను సైతం ఇంట్లో అక్కడక్కడా అమర్చుకోవడానికి ఉపయోగించవచ్చు.

ఇంటి గోడలకు పచ్చటి ప్రకృతికి సంబంధించిన వాల్ స్టిక్కర్లు లేదా పెయింటింగ్‌లను అమర్చడం వల్ల అధిక ఉష్ణోగ్రత వల్ల కలిగే చిరాకును తగ్గించడంలో తోడ్పడతాయి.





























