TS Weather Report: తెలంగాణ వాసులకు హెచ్చరిక.. నేడు, రేపు భానుడి భగభగలే..!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ఠాకెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి ప్రతాపం మొదలవుతుంది. రాష్ట్రంలోని పలుచోట్ల 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ఠాకెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడి ప్రతాపం మొదలవుతుంది. రాష్ట్రంలోని పలుచోట్ల 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా రోడ్లపై ఎండమావులు ఏర్పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో మాత్రం ఎంత తీవ్రత అధికంగా ఉంటోంది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే ఈసారి ఎండలు తీవ్రంగా ఉన్నాయనే చెప్పాలి. బుధవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 41.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 22.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
గురువారం, శుక్రవారాల్లో అంటే నేడు, రేపు కూడా పలుప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్యన ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేస్తోంది. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండ తీవ్రంగా ఉండే సమయాల్లో పూర్తిగా ఇళ్లలోనే ఉండాలని, చల్లని పానియాలు, తేలికపాటి ఆహారాలు సేవించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.