Watch Video: ఎండలు బాబోయ్‌ ఎండలు.. రోడ్లు కూడా కరిగిపోతున్నాయ్‌.. వైరల్ అవుతోన్న వీడియో

గత రెండు మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా వాతావరణ ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. సూరత్, అహ్మదాబాద్‌లలో మంగళవారం ఎండ తీవ్రతకు ప్రజలు నానాఇక్కట్లు పడ్డారు. ఎండ వేడిమికి రోడ్లపై వేసిన తారు సైతం కరిగి ఏరులై పారింది. దీంతో పైన బాణుడి భగభగలు, కింద రోడ్డుపై నీరైన..

Watch Video: ఎండలు బాబోయ్‌ ఎండలు.. రోడ్లు కూడా కరిగిపోతున్నాయ్‌.. వైరల్ అవుతోన్న వీడియో
Ahmedabad Roads
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 12, 2023 | 6:47 PM

గత రెండు మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా వాతావరణ ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. సూరత్, అహ్మదాబాద్‌లలో మంగళవారం ఎండ తీవ్రతకు ప్రజలు నానాఇక్కట్లు పడ్డారు. ఎండ వేడిమికి రోడ్లపై వేసిన తారు సైతం కరిగి ఏరులై పారింది. దీంతో పైన బాణుడి భగభగలు, కింద రోడ్డుపై నీరైన తారు.. వెరసి ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం కనిపించింది. సోమవారం, మంగళవారాల్లో అహ్మదాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. పెరుగుతున్న ఎండ వేడిమి కారణంగా సూరత్‌లోని అదాజన్ పాటియాను కలిపే 200 మీటర్ల చంద్ర శేఖర్ ఆజాద్ వంతెన ఏర్పాటు చేశారు. దీనిపై ఏర్పాటు చేసిన రహదారిపై తాజాగా వేసిన తారు రోడ్డు కరిగిపోయింది. దీంతో వాహనదారులు జారిపడకుండా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయవల్సి వచ్చింది. పాదచారులు కూడా చెప్పులు రోడ్డుకు అంటుకుపోతుండటంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. మునుముందు రోజుల్లో కూడా ఇదే రీతిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.

వర్షాకాలానికి ముందు రోడ్లు దెబ్బతినకుండా ఉండేందుకు తారును వేయడం జరుగుతుంది. నగరంలో గత నెల రోజుల నుంచి పలు ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులు జరిగాయి. ఆ సమయంలో వేసిన తారు ఆరిపోవడానికి రాళ్లతో కూడిన మట్టి చల్లామని, మధ్యాహ్నం తర్వాత ఎండ తీవ్రత వల్ల రోడ్డుపై వేసిన తారు కరగడం వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. కరిగిన తారుపై రాళ్ల మట్టిని మరొక పొరగా చల్లితే సమస్య పరిష్కారమవుతుందని సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ (SMC) అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.