Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICI Bank Robbery: ఐసీఐసీఐ బ్యాంకులో భారీ చోరీ.. ఆయుధాలతో బెదిరించి 40 లక్షల క్యాష్, గోల్డ్‌ జ్యువెల్లరీతో పరార్‌

ఐసీఐసీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. దుండగులు ఆయుధాలతో బ్యాంకులో ప్రవేశించి 40 లక్షల రూపాయలు, బంగారు ఆభరణాలు లూటీ చేశారు. బీహార్‌లోని మోతీహరి బ్రాంచ్‌లో బుధవారం (ఏప్రిల్‌ 12) ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ICICI Bank Robbery: ఐసీఐసీఐ బ్యాంకులో భారీ చోరీ.. ఆయుధాలతో బెదిరించి 40 లక్షల క్యాష్, గోల్డ్‌ జ్యువెల్లరీతో పరార్‌
ICICI Bank Robbery
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 13, 2023 | 12:40 PM

ఐసీఐసీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. దుండగులు ఆయుధాలతో బ్యాంకులో ప్రవేశించి 40 లక్షల రూపాయలు, బంగారు ఆభరణాలు లూటీ చేశారు. బీహార్‌లోని మోతీహరి బ్రాంచ్‌లో బుధవారం (ఏప్రిల్‌ 12) ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని మోతీహరి, చాకియాలోని ఐసీఐసీఐ బ్యాంక్‌ బ్రాంచ్‌లోకి ఐదుగురు వ్యక్తులు ప్రవేశించారు. తమ వద్ద ఉన్న ఆయుధాలతో బ్యాంకు సిబ్బందిని బెదిరించి రూ. 40 లక్షల నగదు, బంగారు ఆభరణాలను అపహరించారు. అనంతరం బైక్‌పై పారిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదేమాదిరి గతేడాది మే 25న మోతిహారీలోని చాకియాలోని నగల దుకాణంలో భారీ ఎత్తున్న దోపిడీ జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడితో సహా ఇద్దరు వ్యక్తులను బీహార్ పోలీసులు అరెస్టు చేశారు.

12 మంది వ్యక్తులు ఆయుధాలతో బెదిరించి దేవిలాల్ ప్రసాద్ జ్యువెలర్స్‌ను దోచుకున్నారు. ఈక్రమంలో యజమాని ఇద్దరు కుమారులు సుధీర్ సరాఫ్, పవన్ సరాఫ్‌లను గన్‌తో కాల్చి చంపి దాదాపు ఏడు కిలోల బంగారం, 50 కిలోల వెండి, లక్షల రూపాయల నగదుతో పారిపోయారు. ఈ కేసులో పోలీసులు 17 మందిని అరెస్టు చేసి వారి నుంచి రెండు కిలోల బంగారం, 15 కిలోల వెండి, 14.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ముఖేష్ కుమార్, అతని సహచరుడు రవి కుమార్ నుంచి డ్రగ్స్, తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కాంతేష్ కుమార్ మిశ్రా వెల్లడించారు. కాగా బీహార్‌లో దొంగముఠా ఇలా వరుస చోరీలకు పాల్పడుతుండటంతో స్థానికులు భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.