AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇదేం విచిత్రం.. రోజుల వయసున్న లేగ దూడ పాలిస్తుంది.. రోజుకు ఎంతో తెల్సా..?

ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చూశాం. స్థానికులు దేవుడి మహత్యం అని చెబుతూ ఉంటారు. కానీ నిపుణులు మాత్రం హార్మోన్ల అసమతుల్యత అని కొట్టి పారేస్తుంటారు. తాజా ఘటన తాలూకా వివరాలు తెలుసుకుందాం పదండి.

Viral: ఇదేం విచిత్రం.. రోజుల వయసున్న లేగ దూడ పాలిస్తుంది.. రోజుకు ఎంతో తెల్సా..?
Calf Giving Milk
Ram Naramaneni
|

Updated on: Apr 13, 2023 | 1:20 PM

Share

ఈ చిత్రం చూశారా సుమీ..? రోజుల వయస్సున్న లేగ దూడ పాలిస్తుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ బుజ్జి దూడను చూసేందుకు పోటెత్తున్నారు. ఇది ఇప్పుడు అక్కడ సెలబ్రిటీగా మారింది. బెంగాల్‌లోని ముర్షీదాబాద్​ జిల్లాలోని షుకురియా గ్రామంలో ఈ వింత ఘటన వెలుగు చూసింది. ఆ లేగ దూడ వయస్సు  కేవలం 29 రోజులేనట. దేవుడి మహిమ వల్లే ఇలా జరుగుతుందని.. దూడ యజమాని ఉత్తమ్ మొండల్ చెబుతున్నాడు. తన ఇంట్లో శాలిగ్రామ శిల ఉందని.. దాన్ని రోజూ పాలతో అభిషేకించి.. పూజలు చేస్తానని ఆయన బెబుతున్నాడు. దాని ఫలితంగానే ఇప్పుడా దూడ పాలిస్తుందని అంటున్నాడు.

రోజుకు  750 మిల్లీలీటర్లు పాలిస్తున్న ఈ లేగ దూడ.. మరోవైపు తల్లి ఆవు పాలు కూడా తాగుతుంది. అయితే ఈ దూడ పుట్టే సమయంలో చాలా ఇబ్బందులు పడిందట. అప్పుడు దాని బరువు కూడా సాధారణంగా పుట్టే దూడల కంటే కాస్త ఎక్కువ ఉందట. దూడ పుట్టిన 21 రోజుల తర్వాత దానికి పాలిండ్లు పెరగడం గమనించానని మొండల్ వెల్లడించాడు.

ఆ బుజ్జి లేగ దూడ నుంచి పాలు పితుకుతున్న చిత్రాలు ప్రజంట్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసి పశు వైద్యులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దాని పాల గ్రంధి హార్మోన్ల అసమతుల్యత కారణంగానే ఇలా జరుగుతుందని మరికొందరు పశు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దూడ ఇంకా ఎంత కాలం పాలిస్తుంది.. అది ఎదుగుతున్న కొద్దీ ఇచ్చే పాలు పెరుగుతాయా అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..