Astro Tips: మేషరాశిలోకి సూర్యభగవానుడి ప్రవేశం.. ఈ 4 రాశులవారికి పట్టిందంత బంగారం.. దక్కనున్న అధికార యోగం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలన్నీ కూడా నిర్ధిష్ట కాలం తర్వాత తమ రాశిని మారుస్తుంటాయి. ఇక గ్రహాల రాశి మార్పు అన్ని రకాల జాతకులను ప్రభోవితం చేస్తుంది. అయితే ఆ ప్రభావం కొందరికి అశుభంగా, మరి కొందరికి అదృష్టంగాఉంటుంది. ఈ క్రమంలోనే గ్రహాలకు..
Astro Tips: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలన్నీ కూడా నిర్ధిష్ట కాలం తర్వాత తమ రాశిని మారుస్తుంటాయి. ఇక గ్రహాల రాశి మార్పు అన్ని రకాల జాతకులను ప్రభోవితం చేస్తుంది. అయితే ఆ ప్రభావం కొందరికి అశుభంగా, మరి కొందరికి అదృష్టంగాఉంటుంది. ఈ క్రమంలోనే గ్రహాలకు రాజైన సూర్యభగవానుడు మేషరాశిలోకి ఈ రోజు(ఏప్రిల్ 14) ప్రవేశించనున్నాడు. అలాగే మే 15 వరకు కూడా మేషరాశిలోనే సూర్యుడు ఉంటాడు. ముందుగా చెప్పుకున్నట్లే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల రాశిచక్రంలోని అన్ని రాశులపైనా కూడా ప్రభావం ఉంటుంది. మరి మేషరాశిలో సూర్య గ్రహ సంచారం ఏయే రాశులకు శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాం..
మేషరాశిలో సూర్య గ్రహ సంచారం ఈ రాశులకు మేలు
కర్కాటక రాశి: మేషరాశిలో సూర్యుని సంచారం కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనలాభాలను ఇస్తుంది. ఇంకా ఈ రాశివారికి నచ్చిన ప్రమోషన్ లేదా జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పైగా వరికి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అవకాశం ఉంది.
సింహ రాశి: సింహరాశికిఅధిపతి సూర్యుడు. ఆ కారణంగా మేషరాశిలో సూర్య సంచారం ఈ రాశివారికి మేలుచేస్తుంది. వ్యాపారాభివృద్ధితో పాటు పేరుప్రఖ్యాతులు కూడా సదా మీకుత తోడుగా ఉంటాయి.
మేష రాశి: సూర్య సంచారం ఇదే రాశిలో జరుగుతున్నందున మేషరాశివారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరిగి, కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్‌లో పురోగతి, కొత్త ఉద్యోగంలో చేరుతారు. వ్యాపారంలో మీరు మంచి లాభాలను గడిస్తారు.
వృశ్చిక రాశి: మేషరాశిలో సూర్య సంచారం వృశ్చిక రాశివారికి ప్రమోషన్, పురోగతి, ఆదాయాన్ని ఇస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. వ్యాపారాలు వెలసిల్లుతాయి.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలను ఇక్కడ చదవండి..