AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Astrology: ఉందిలే మంచి కాలం ముందు ముందునా.. వారి జీవితాల్లో పెను మార్పులు, శుభ వార్తలు..!

శుభగ్రహాల బలం పెరగటం వల్ల దాదాపు అన్ని రాశుల వారి జీవితాల్లోనూ సానుకూల మార్పులు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా చాలా కాలం నుంచి పెండింగులో ఉన్న ముఖ్యమైన పనులు వేగంగా పూర్తి కావడం మొదలవుతుంది.

Telugu Astrology: ఉందిలే మంచి కాలం ముందు ముందునా.. వారి జీవితాల్లో పెను మార్పులు, శుభ వార్తలు..!
Telugu AstrologyImage Credit source: TV9 Telugu
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Apr 14, 2023 | 12:24 PM

Share
ఏప్రిల్ 15వ తేదీ నుంచి శుభగ్రహాలకు బలం పెరిగి పాపగ్రహాలకు బలం తగ్గడం జరుగుతోంది. శుభగ్రహాలైన గురు, శుక్ర, బుధ గ్రహాలకు బలం పెరుగుతుండగా కుజ, రాహు, కేతు గ్రహాలకు బలం క్షీణించడం ప్రారంభం అవుతుంది. మేషంలో ఉన్న రాహువుతో గురు గ్రహం కలవడం వల్ల రాహువులోని పాపత్వం చాలావరకు తగ్గిపోతుంది. శని, రవి గ్రహాలు కూడా పాపగ్రహాలే అయినప్పటికీ ఇవి స్వక్షేత్రంలో మిత్ర క్షేత్రంలో ఉండటం వల్ల వీటి పాపత్వం శుభత్వం ఎక్కువగా ఉంటుంది.
శుభగ్రహాల బలం పెరగటం వల్ల దాదాపు అన్ని రాశుల వారి జీవితాల్లోనూ సానుకూల మార్పులు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా చాలా కాలం నుంచి పెండింగులో ఉన్న ముఖ్యమైన పనులు వేగంగా పూర్తి కావడం మొదలవుతుంది. ఎన్ని రకాలుగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కుదరని సంబంధాలు ఇప్పుడు కుదరటం ప్రారంభం అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరగటంలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వ్యక్తిగత జాతక చక్రాలు అనుకూలించనప్పటికీ, దాదాపు అన్ని రాశుల వారికి కొద్దో గొప్పో శుభ ఫలితాలే అనుభవానికి వస్తాయి. ఏ రాశుల వారికి ఏ విధంగా శుభం జరగబోతుందో ఇక్కడ పరిశీలిద్దాం.
  1. మేషం, కర్కాటకం, తుల, మకరం: ఈ నాలుగు చరరాశుల వారికి ఉద్యోగ పరంగా, సంపాదనపరంగా మేలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులు, ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారు ఆశించిన ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. సంపాదన కూడా సంతృప్తికర స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగంలోనే కాకుండా వృత్తి, వ్యాపారాల్లో కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ కావడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకోవడానికి, వృత్తి జీవితం ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్న వారు విజయాలు సాధిస్తారు. సాధారణంగా ఆదాయపరంగా అదృష్టం పడుతుంది.
  2. వృషభం, సింహం, వృశ్చికం, కుంభం: ఈ నాలుగు స్థిర రాశుల వారికి చిన్న ప్రయ త్నంతో గృహ వాహన సౌకర్యాలు అమరుతాయి. వీరి ఆస్తుల విలువ పెరుగుతుంది. కొత్తగా ఆస్తులు గానీ, ఆభరణాలు గానీ కొని అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఆరోగ్య పరంగా ఎంతో ఉపశమనం లభిస్తుంది. సుమారు రెండు నెలల పాటు వీరు ఎటువంటి ప్రయత్నం చేసినా అది తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు వీరి ముందుకు వస్తాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభ శాతం పెరగటంతో పాటు కొత్త ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.
  3. మిథునం, కన్య, ధనుస్సు, మీనం: ఈ నాలుగు ద్విస్వభావ రాశుల వారికి అటు ఉద్యోగ పరంగా, ఇటు సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. చాలాకాలంగా పీడిస్తున్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా పరిస్థితులు కలసి వస్తాయి. ఉన్నత విద్యకు, ఉన్నత స్థాయి ఉద్యోగాలకు, విదేశీ ప్రయాణాలకు ఎంతో అవకాశం ఉంది. ఎంత ప్రయత్నం చేస్తే అంతగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మంచి చోట పెళ్లి సంబంధాలు కుదరటం, ప్రేమ వ్యవహారాలు విజయవంతం కావటం, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు కొద్ది ప్రయ త్నంతో సానుకూలంగా పరిష్కారం కావడం, ముఖ్యమైన పనులు వేగంగా పూర్తి కావడం, కోర్టు కేసులు అనుకూలంగా మారటం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పాజిటివ్ గా వ్యవహరిస్తే ఈ రాశుల వారికి ఎక్కువగా మంచి జరిగే అవకాశం ఉంది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలను ఇక్కడ చదవండి..

ఇవి కూడా చదవండి