AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: విరాట్‌ అంకుల్‌.. మీ కూతురిని డేట్‌కు తీసుకెళ్లొచ్చా.. వైరలవుతోన్న పోస్టర్.. ఫైరవుతోన్న ఫ్యాన్స్..

Virat Kohli: ఈ మ్యాచ్ సమయంలో స్టాండ్స్‌లో కూర్చున్న ఓ యువ అభిమాని పోస్టర్ సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అయ్యింది. అందులో అతను విరాట్ కోహ్లీ కుమార్తె వామికతో డేటింగ్ గురించి ప్రస్తావించాడు.

IPL 2023: విరాట్‌ అంకుల్‌.. మీ కూతురిని డేట్‌కు తీసుకెళ్లొచ్చా.. వైరలవుతోన్న పోస్టర్.. ఫైరవుతోన్న ఫ్యాన్స్..
Virat Kohli
Venkata Chari
|

Updated on: Apr 18, 2023 | 8:16 PM

Share

Indian Premier League 2023: ఏప్రిల్ 17న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో, రెండు జట్ల నుంచి అద్భుతమైన బ్యాటింగ్ కనిపించింది. ఈ మ్యాచ్‌లో 400 కంటే ఎక్కువ పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్ సమయంలో స్టాండ్స్‌లో కూర్చున్న ఓ యువ అభిమాని పోస్టర్ సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అయ్యింది. అందులో అతను విరాట్ కోహ్లీ కుమార్తె వామికతో డేటింగ్ గురించి ప్రస్తావించాడు.

ఈ యువ అభిమాని పోస్టర్‌ను పట్టుకుని, అందులో ‘హై, విరాట్ అంకుల్.. నేను వామికను డేట్‌కి తీసుకెళ్లవచ్చా.? అంటూ ఓ చిన్నారి చేతిలో పోస్టర్‌తో హల్ చల్ చేశాడు. ఈ పోస్టర్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో అభిమానుల్లో ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది. చిన్నారి తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు.. వారి ప్రవర్తనను కూడా ఖండించారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్టర్‌తో కనిపించిన పిల్లాడిని చూస్తే అందులో రాసుకున్న మాట‌ల‌కు పూర్తి అర్థం తెలియ‌క‌పోవచ్చని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలిచ్చారు.

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో విఫలమైన విరాట్ కోహ్లీ..

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడితే, RCB జట్టు 227 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేక చతికిల పడింది. 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..