Rohit Sharma Record, IPL 2023: భారీ రికార్డులో చేరిన రోహిత్ శర్మ.. భారత్ నుంచి మూడో ప్లేయర్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
SRH VS MI, IPL 2023: హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఒక పెద్ద మైలురాయిని సాధించాడు. కానీ, ఆ తర్వాత పొరపాటుతో తీవ్రంగా నష్టపోయాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో రోహిత్ శర్మ ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు. అతని పేరుపై ఒకే అర్ధ సెంచరీ ఉంది. ముంబై సారథి ఆరంభం బాగానే ఉన్నా ఆ తర్వాత పెద్ద ఇన్నింగ్స్‌లుగా మలచలేకపోతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అలాంటిదే జరిగింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ 18 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఆపై నాలుగో ఓవర్‌లో బ్యాడ్ షాట్‌తో పెవిలియన్‌కు చేరాడు.
రోహిత్ శర్మను టి నటరాజన్ అవుట్ చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ముందు రోహిత్ మరోసారి నిస్సహాయంగా కనిపించాడు. శుభారంభం తర్వాత రోహిత్ ఔటయ్యాడు. అయితే ఈ ఆటగాడు పెవిలియన్‌కు చేరుకునే ముందు పెద్ద మైలురాయిని సాధించాడు.
6000 పరుగులు లిస్టులో రోహిత్..
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన 6000 IPL పరుగులను పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన మూడో భారతీయుడు, ఓవరాల్‌గా నాలుగో ఆటగాడు రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ 227 ఇన్నింగ్స్‌ల్లో 6000 పరుగులు పూర్తి చేశాడు.
లిస్టులో ఎవరున్నారంటే..
డేవిడ్ వార్నర్ అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేశాడు. అతను 165 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. విరాట్ కోహ్లీ 188 ఇన్నింగ్స్‌ల్లో 6000 పరుగులు పూర్తి చేశాడు. శిఖర్ ధావన్ 199 ఇన్నింగ్స్‌లలో ఈ సంఖ్యను తాకాడు. తాజాగా ఈ జాబితాలో రోహిత్ శర్మ కూడా చేరాడు.
రోహిత్ శర్మ సత్తా ఐపీఎల్‌లో కనిపించడం లేదు. ఐపీఎల్‌లో రోహిత్ 6000 పరుగులు పూర్తి చేసినప్పటికీ ఈ ఆటగాడి సగటు 30.22 మాత్రమే. అలాగే అతని స్ట్రైక్ రేట్ కూడా 130.03గా ఉంది. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి రోహిత్ ఆడుతున్నాడు. అతని పేరుతో ఒకే ఒక సెంచరీ ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..