Kohli vs Ganguly: కోపంగా చూసిన కోహ్లీ.. షేక్ హ్యాండ్ ఇవ్వని గంగూలీ.. మరోసారి బయటపడ్డ విబేధాలు.. వైరల్ వీడియో..

ఐపీఎల్ 16వ సీజన్ 20వ లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టుతో తలపడిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది.

Kohli vs Ganguly: కోపంగా చూసిన కోహ్లీ.. షేక్ హ్యాండ్ ఇవ్వని గంగూలీ.. మరోసారి బయటపడ్డ విబేధాలు.. వైరల్ వీడియో..
Ganguly Vs Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Apr 15, 2023 | 9:59 PM

ఐపీఎల్ 16వ సీజన్ 20వ లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టుతో తలపడిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కొంది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా దిగ్గజ ప్లేయర్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య విబేధాలు మరోసారి తేటతెల్లమయ్యాయి.

సౌరవ్ గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు డైరెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ ఇన్నింగ్స్‌‌లో కింగ్ కోహ్లి టీమిండియా మాజీ ప్లేయర్ గంగూలీని కోపంగా చూసిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయింది.

ఇవి కూడా చదవండి

ఆర్‌సీబీ స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ బౌలింగ్‌ చేస్తున్నాడు. డీసీ ప్లేయర్ అమన్‌ హకీమ్‌ భారీ షాట్‌ ఆడబోయాడు. ఈ క్రమంలో బౌండరీ వద్ద నిల్చున్న కోహ్లి చేతికి చిక్కాడు. క్యాచ్ పట్టిన కోహ్లీ.. ఢిల్లీ టీం డగౌట్‌ వద్ద కూర్చున్న గంగూలీ వైపు చూస్తూ.. కోహ్లి ఓ సీరియస్ లుక్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో గంగూలీ కూడా రన్‌ మెషీన్‌ను కోపంగానే చూశాడు. ఇదంతా మ్యాచ్ సమయంలో జరిగింది.

ఇక అసలు కథ మ్యాచ్ ముగిసిన తర్వాత మొదలైంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోయింది. ఈ క్రమంలో వీరిద్దరూ మరోసారి ఎదురయ్యారు. కానీ, గంగూలీ మాత్రం కింగ్ కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయాడు. పాంటింగ్‌ వెనుక ఉన్న గంగూలీ.. ఇరుజట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో మాత్రం పాంటింగ్‌ను దాటేసి.. ముందుకు వెళ్లిపోయాడు. దీంతో నెటిజన్లు ఈ సీన్స్‌కు సంబంధించిన వీడియోలను తెగ వైరల్ చేస్తున్నారు. దీనిని చూసిన ఫ్యాన్స్ ”కోహ్లి పాత గాయాన్ని ఇంకా మర్చిపోలేదేమో” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..