AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సమ్మర్‌ కోచింగ్‌.. స్పోర్ట్స్‌ టీచింగ్‌.. జీహెచ్‌ఎంసీ పరిధిలో క్యాంపులు.. ఎలా బుక్ చేసుకోవాలంటే..

ఈ సమ్మర్ క్యాంపులలో 44 రకాల క్రీడలలో శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణను 6 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలలోపు పిల్లలకు జిహెచ్ఎంసి పరిధిలో వివిధ ప్లే గ్రౌండ్ లలో నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తిగల విద్యార్థులు..

Hyderabad: సమ్మర్‌ కోచింగ్‌.. స్పోర్ట్స్‌ టీచింగ్‌.. జీహెచ్‌ఎంసీ పరిధిలో క్యాంపులు.. ఎలా బుక్ చేసుకోవాలంటే..
GHMC Summer coaching camps
Sanjay Kasula
|

Updated on: Apr 19, 2023 | 7:08 PM

Share

జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు 37 రోజుల పాటు సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ఈ సమ్మర్ క్యాంపులలో 44 రకాల క్రీడలలో శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణను 6 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలలోపు పిల్లలకు జిహెచ్ఎంసి పరిధిలో వివిధ ప్లే గ్రౌండ్ లలో నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తిగల విద్యార్థులు వెబ్ సైట్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని మేయర్ కోరారు. ఇందులో భాగంగా అథ్లెటిక్స్, ఆర్చరి, బాల్ బాడ్మిటన్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాక్సింగ్, క్రికెట్, చెస్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుడ్ బాల్, జిమ్నాస్టిక్, హాకీ, హ్యాండ్ బాల్, జూడో, కరాటే, కబడ్డీ, ఖోఖో, కార్ఫ్ బాల్, మాల్ కంబా, నెట్ బాల్, రోలార్ స్కేటింగ్, సాఫ్ట్ బాల్, స్విమ్మింగ్, సెపక్ తక్రా, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, టెన్నికైట్, థైక్వాండో, తగఫ్ వార్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెస్లింగ్ ఇండియన్, రెస్లింగ్ రోమన్, ఉషు, యోగా, త్రో బాల్, కిక్ బాక్సింగ్, మయ్ థాయ్, స్కే మార్షల్ ఆర్ట్స్, మినీ ఫుట్ బాల్, క్యారమ్స్ తదితర గేమ్స్ నిర్వహిస్తారని తెలిపారు.

స్పెషల్ సమ్మర్ కోచింగ్ లో భాగంగా క్రీడాకారులకు వివిధ రకాల పోటీలను నిర్వహించడం జరుగుతుంది. అందులో స్పోర్ట్స్ క్విజ్, ఇంటర్ సెంటర్ టోర్నమెంట్స్, జాతీయ, అంతర్జాతీయ ప్లేయర్స్ తో ముఖాముఖి, క్రీడల పై స్ఫూర్తిని పెంపొందించేందుకు ఆటల నియమ నిబంధనల పై అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ నెల 25న ఉదయం 8గంటలకు ఖైరతాబాద్ జోన్ లోని విక్టరీ ప్లే గ్రౌండ్ ప్రారంభమవుతుంది.

ఏప్రిల్ 26న సాయంత్రం 4 గంటలకు చార్మినార్ జోన్ లో కులి కుతుబ్ షా స్టేడియం, ఏప్రిల్ 27న ఉదయం 8 గంటలకు  సికింద్రాబాద్ జోన్ లో మారేడుపల్లి ప్లే గ్రౌండ్, ఏప్రిల్ 28న సాయంత్రం 4 గంటలకు కూకట్ పల్లి, శేరిలింగం పల్లి జోన్ పి.జె.ఆర్ చందానగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియం, ఏప్రిల్ 29న ఉదయం 8 గంటలకు ఎల్బీనగర్ జోన్ ఉప్పల్ స్టేడియంలో  సమ్మర్ కోచింగ్ క్యాంపులు ప్రారంభమవుతాయి.

క్రీడా మైదానాలు ఇవే..

జిహెచ్ఎంసి స్పోర్ట్స్ క్విజ్ మే 8వ తేదీన ఉదయం 6:30 గంటలకు ఖైరతాబాద్ జోన్ విక్టరీ ప్లే గ్రౌండ్ ప్రారంభమవుతుందని తెలిపారు. మే 9వ తేదీన ఉదయం 6:30 గంటలకు చార్మినార్ జోన్ లోని గౌలిపుర పి.జి ప్రాంగణంలో ప్రారంభమవుతుంది. మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ జోన్ స్విమ్మింగ్ పూల్ లో ప్రారంభమవుతుంది. మే 11న ఉదయం 6:30 గంటలకు కూకట్ పల్లి జోన్, శేరిలింగం పల్లి జోన్ చందానగర్ పి.జె.ఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. మే 12 వ తేదీన ఉదయం 6:30 గంటలకు ఎల్బీనగర్ జోన్ జిహెచ్ఎంసి ఉప్పల్ స్టేడియంలో ప్రారంభవుతుంది. మే 13న ఉదయం 7గంటలకు గ్రాండ్ ఫైనల్ విక్టరీ ప్లే గ్రౌండ్ లో జరుగుతాయని తెలిపారు.

16 రకాల గేమ్స్ ఇవే..

మే 15 నుండి 19వ తేదీ వరకు ఇంటర్ ఎస్.సి.సి టోర్నమెంట్ లో భాగంగా 16 రకాల గేమ్స్ ను నిర్వహిస్తారు.

  1. బాస్కెట్ బాల్
  2. బాడ్మింటన్బా
  3. క్సింగ్
  4. క్రికెట్
  5. చెస్
  6. క్యారమ్స్
  7. పుట్ బాల్
  8. జిమ్నాస్టిక్
  9. హాకీ
  10. కబడ్డీ
  11. రోలార్ స్కేటింగ్
  12. సెపక్ తక్రా
  13. టేబుల్ టెన్నీస్
  14. టెన్నీస్
  15. టెన్నికైట్
  16. వాలీబాల్ టోర్నమెంట్

ముగింపు కార్యక్రమం..

మే 26న చార్మినార్ జోన్ కులి కుతుబ్ షా స్టేడియం లో సాయంత్రం 4 గంటలకు ముగింపు కార్యక్రమం జరుగుతుంది. మే 27న ఎల్బీనగర్ జోన్ జిహెచ్ఎంసి ఉప్పల్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు ముగింపు కార్యక్రమం జరుగుతుంది. మే 29న కూకట్ పల్లి జోన్ శేరిలింగంపల్లి చందానగర్ పి.జె.ఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ముగింపు కార్యక్రమం జరుగుతుంది. మే 30వ తేదిన సికింద్రాబాద్ జోన్ మారేడ్ పల్లి ప్లే గ్రౌండ్ లో సాయంత్రం 4 గంటలకు ముగింపు కార్యక్రమం జరుగుతుంది. మే 31న ఖైరతాబాద్ జోన్ విక్టరీ ప్లే గ్రౌండ్ లో సాయంత్రం 4 గంటలకు ముగింపు కార్యక్రమం జరుగుతుంది.

ఈ సందర్భంగా జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు ప్లే గ్రౌండ్ లలో కావాల్సిన స్పోర్ట్స్ మెటీరియల్స్ ను సమకూర్చుకోవాలని మేయర్ అధికారులను ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం