Warangal: డాక్టర్ ప్రీతికి మృతి కేసులో నిందితుడు సైఫ్‌కు బెయిల్..
తెలంగాణలో సంచలనం రేపిన మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన డాక్టర్ సైఫ్‌కు బెయిల్ మంజూరైంది. సైఫ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. రూ. 10 వేల రూపాయలు, ఇద్దరు పూచీకత్తుతో పాటు.. 16 వారాల పాటు ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది ధర్మాసనం.
తెలంగాణలో సంచలనం రేపిన మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన డాక్టర్ సైఫ్‌కు బెయిల్ మంజూరైంది. సైఫ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. రూ. 10 వేల రూపాయలు, ఇద్దరు పూచీకత్తుతో పాటు.. 16 వారాల పాటు ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది ధర్మాసనం. కేసు విచారణ నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డా, సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినా బెయిల్ రద్దు చేయడం జరుగుతుందని న్యాయస్థానం పేర్కొంది.
సీనియర్ డాక్టర్ సైఫ్ వేధింపులు తాళలేక వరంగల్‌లో పీజీ మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రీతి మరణానికి కారణం సైఫ్ వేధింపులే అని తేల్చారు పోలీసులు. దాంతో కోర్టు అతనికి రిమాండ్ విధించింది. ఇప్పుడు ఇదే కేసులో కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..