CM KCR: బీఆర్ఎస్‌కు ‘మహా’ జోష్.. పార్టీలో చేరిన పలువురు కీలక నేతలు.. ఆహ్వానించిన సీఎం కేసీఆర్
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర రోజు రోజుకూ కొనసాగుతోంది. బుధవారం నాడు అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో ఔరంగాబాద్ ప్రాంతం నుంచి కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర రోజు రోజుకూ కొనసాగుతోంది. బుధవారం నాడు అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో ఔరంగాబాద్ ప్రాంతం నుంచి కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాకప్పి సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినవారిలో ఎన్‌సీపీ నుంచి.. ఔరంగాబాద్ జడ్పీ చైర్మన్ ఫిరోజ్ ఖాన్, ఔరంగాబాద్ ఎన్‌సీపీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ రణ్వా సింగ్, విదర్భ షెత్కారి సంఘటన్ అధ్యక్షుడు జంగదీష్ పాండే, మహారాష్ట్ర అన్నదాత శేటకారి సంఘటన్ అధ్యక్షుడు జయజీ రావు సూర్య వంశీ, పోలంబరి ఎన్సిపి ఉపాధ్యక్షుడు త్రయంబత్ మడ్గే చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరితో పాటు పలువురు సీనియర్ రాజకీయ నేతలు, రైతు సంఘం నాయకులు, సామాజిక సేవ తదితర రంగాలకు చెందిన పలువురు నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
చేరిన వారిలో…జగదీష్ బోండే, కాశీనాథ్ ఫుటానే, కుల్దీప్ బోండే, స్వప్నిల్ వాకోడే, నందకిషోర్ ఖేర్డే, రుషబ్ వాకోడే,విజయ్ విల్హేకర్, సంజయ్ తైడే, అజయ్ దేశ్‌ముఖ్, అరుణ్ సాకోరే, సునీల్ షెరేవార్ , ప్రమోద్ వాంఖడే , సునీల్ పడోలె, ప్రవీణ్ కోల్హే, జ్ఞానేశ్వర్ గాడే, గజానన్ భగత్, అమోల్ జాదవ్, సంజయ్ భుర్కటే, భీమ్‌రావ్ కొరాడ్కర్, సతీష్ అగర్వాల్, జె డి పాటిల్, గజానన్ దేవకే, సంజయ్ భర్సక్లే, సునీల్ సాబల్,సుశీల్ కచ్వే, మహేంద్ర గవాండే, గులాబ్ చవాన్, ఎన్ డి బ్రహ్మంకర్,ప్రమోద్ వాంఖడే, పురుషోత్తం ధోటే, కుమార్ సోమవంశీ, విజయ్ లాజుర్కర్, అంకుష్ మాకోడే, సాగర్ గవాండే, సుధాకర్ తేటే తదితరులున్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. రైతుల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. కాగా.. మహారాష్ట్రలో ఏప్రిల్ 24 మీటింగ్ కు ముందు బీఆర్ఎస్ లో చేరికలు ప్రాధాన్యం సంతరించుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..