Telangana: పేరెంట్స్‌కు షాకింగ్ న్యూస్.. పెరగనున్న పాఠ్య పుస్తకాలు భారం..

రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో I నుండి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరం అది ఒక క్లాస్ పెరిగింది. అంతే 9 తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. దీంతో విద్యార్థులు ఇంగ్లీషు మీడియం సూచనలను సులభంగా అర్థం చేసుకునేందుకు, ద్విభాషా అంటే ఆంగ్లం, తెలుగు కలిపి పాఠ్యపుస్తకాలు ముద్రిస్తున్నారు.

Telangana: పేరెంట్స్‌కు షాకింగ్ న్యూస్.. పెరగనున్న పాఠ్య పుస్తకాలు భారం..
School Textbooks
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 19, 2023 | 1:56 PM

తెలంగాణలోని విద్యార్థుల తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్. ఈ సారి రాష్ట్ర సిలబస్‌ గల పాఠ్యపుస్తకాల ధరలు పెరగనున్నాయి. కాగితం మందం పెరగడంతో పాటు పేపర్ ధరలను పెంచడం వల్ల, తల్లిదండ్రులు గత ఏడాదితో పోల్చితే రాబోయే విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాల కోసం కనీసం 30 శాతం నుంచి 35 శాతం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో.. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న వారి తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. రాష్ట్రంలో దాదాపు 11,000 ప్రైవేట్ పాఠశాలల్లో.. 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలలకు 1.22 కోట్లకు పైగా సేల్ కాంపోనెంట్ పాఠ్యపుస్తకాలు అవసరం అవుతాయి.  వీటిని మే 1 నుంచి మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

“గత సంవత్సరం రూ. 55 ధర ఉన్న ఒక్కో సేల్ కాంపోనెంట్ పాఠ్యపుస్తకం ధర ఇప్పుడు రూ. 75 ఉంటుంది. పేపర్ ధర పెరగడంతో.. ఈ సంవత్సరం పాఠ్యపుస్తకాల ధర కూడా పెరిగింది” అని పాఠశాల విద్యా శాఖ అధికారి తెలిపారు. 2021లో రూ. 61,000 ఉన్న మెట్రిక్ టన్ను పేపర్.. 2022 నాటికి రూ. 95,000కి పెరగడంతో గత సంవత్సరం, పాఠ్యపుస్తకాల ధరలు దాదాపు 50 శాతం మేర పెరిగాయి. 2021లో పదో తరగతికి సంబంధించిన ఎనిమిది పాఠ్యపుస్తకాల బంచ్ ధర రూ 686గా ఉంది.  2023లో అదే పాఠ్యపుస్తకాల ధర 1,074 రూపాయలకు పెరిగింది. దీన్ని బట్టే రేట్ల పెరుగుదల ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కాగా 2023-24 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ సంస్థల్లోని 28,77,675 మంది విద్యార్థులకు మొత్తం 1,57,48,270 ఉచిత కాంపోనెంట్ పాఠ్యపుస్తకాలు అవసరం. మొత్తం 1,05,38,044 పాఠ్యపుస్తకాలు ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. వాటిని మండలాల్లోని పాఠశాలలకు పంపుతారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు

ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..

ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?

ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో

బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్

అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్