YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి బుధవారం సీబీఐ ఎదుట హాజరయ్యారు.

YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి..
Avinash Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 19, 2023 | 12:42 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి బుధవారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఉదయం 10.30కు అవినాష్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి బయల్దేరి.. కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. ఐదోసారి అవినాష్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. కాగా.. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇవాళ్టి నుంచి 25వ తేదీ వరకు సీబీఐ విచారించనుంది. విచారణను ఆడియో, వీడియోలో అధికారులు రికార్డ్ చేయనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. YS వివేకానందరెడ్డి హత్య జరిగి 4 ఏళ్లు గడిచాయి.! నాలుగేళ్ల కాలంలో ఈ కేసు దర్యాప్తులో లెక్కలేనన్ని ట్విస్టులు. సుప్రీం కూడా జోక్యం చేసుకోవడంతో విచారణను మరింత వేగవంతం చేసింది CBI. ఇన్వెస్టిగేషన్ తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో CBI విచారణ అంతా ఏకపక్షంగా జరుగుతోందని… రాజకీయకక్షలతో కుట్రపూరితంగా ఇరికిస్తున్నారని ఎంపీ అవినాష్ ఆరోపించిన విషయం తెలిసిందే. అసలు కేసుతో సంబంధం లేని తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేసి అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ నోటీసుల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఈనెల 25 వరకు అరెస్ట్‌ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. అయితే అప్పటి వరకు సీబీఐ కార్యాలయంలో ప్రతి రోజూ విచారణకు హాజరుకావాలంటూ షరతు విధించింది.

ఇదిలాఉంటే.. ఇప్పటికే ఎంపీ తండ్రి భాస్కర్‌ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ ఇవాళ కస్టడీలోకి తీసుకోనుంది. ఈ మేరకు సీబీఐ అధికారులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కస్టడీకి తీసుకోనున్నారు. వివేకా హత్య కేసులో ఉదయ్‌కుమార్‌, భాస్కర్‌రెడ్డిలను.. ఆరు రోజుల పాటు సీబీఐ అధికారులు విచారించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..