Hyderabad: 20 రోజుల క్రితం మిస్సైన అసిస్టెంట్ ప్రొఫెసర్.. నిఘా పెట్టగా.. ఓ పండ్ల మార్కెట్‌లో రోజువారీ కూలీగా…
అతడు బాగా చదువుకున్నాడు. మంచి జాబ్ చేస్తున్నాడు. ఎలాంటి ఇబ్బందులు లేవు. అంతా ఫైన్. కానీ ఒకరోజు అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. కానీ పోలీసుల విచారణలో మైండ్ బ్లాంకయ్యే విషయాలు వెలుగుచూశాయి.
అతడు ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో వర్క్ చేస్తున్నాడు. మంచి శాలరీ. ఇంటా, బయట గౌరవం. లోటు పాట్లు ఏమీ లేవు. సమస్యలు కూడా ఏమీ లేవు. కానీ అతడికి జీవితమంటే విరక్తి కలిగింది. రొటీన్‌గా ఒకటే పని చెయ్యలేక చిరాకు వచ్చింది. అంతే ఎవ్వరికీ చెప్పకుండా అదృశ్యమయ్యాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన అతను ఓ కూలీగా మారాడు. ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. పోలీసులు తెలిపివ వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు.. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇంజినీరింగ్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తున్నాడు. ఖమ్మం నుంచి రోజూ వచ్చి పోవడం ఇబ్బంది కావడంతో.. ఇక్కడే ఓ హస్టల్‌లో ఉంటున్నాడు. అందరితోనూ కలిసి మెలిసి ఉండే అతను.. ఈ నెల 7న అదృశ్యమయ్యాడు. అతడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో హాస్టల్ యాజమాన్యం.. కుటుంబ సభ్యలకు సమాచారం ఇచ్చింది.
వెంటనే అక్కడకు చేరుకున్న ఫ్యామిలీ మెంబర్స్ పలు ప్రాంతాల్లో వెతికారు. అతడి ఫ్రెండ్స్, బంధులకు ఫోన్లు చేశారు. అయినా ఆచూకీ చిక్కలేదు. దీంతో ఈ నెల 17న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు షురూ చేశారు. యువకుడి ఫ్యామిలీతో పాటు హాస్టల్ రూమ్స్ మేట్స్, కాలేజ్ స్టూడెంట్స్ నుంచి వివరాలు సేకరించారు. గతంలో కూడా ఇలానే ఆ యువకుడు ఇంటి నుంచి దూరంగా వెళ్లి కూలి పనులు చేసే వాడని కుటుంబ సభ్యులు ద్వారా పోలీసులకు తెలిసింది. దీంతో ఆ కోణంలో దర్యాప్తు షురూ చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పండ్ల మార్కెట్ వద్ద ఆ యువకుడు ఉండే చాన్స్ ఉందని భావించి అక్కడ నిఘా ఉంచారు. మంగళవారం తెల్లవారుజామున మార్కెట్‌కు పనుల కోసం వచ్చే వారిపై పూర్తి ఫోకస్ పెట్టారు. పోలీసులు ఊహించినట్లుగానే అతను మార్కెట్లోని కూలీ పనుల కోసం వచ్చాడు.
వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని.. కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం.. కుటుంబ సభ్యులకు అప్పగించారు. జీవితంపై అసంతృప్తితోనే తాను ఇలా చేసినట్లు ఆ యువకుడు తెలిపాడు. కంప్లైంట్ అందిన 12 గంటల్లోనే ఈ కేసును చేధించారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..