AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాంగ్‌స్టర్‌ అష్రఫ్‌కు భారతరత్న ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ నేత డిమాండ్.. ఆరేళ్లు పార్టీ నుంచి బహిష్కరణ

హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ నేత రజ్జు భయ్యా అలియాస్ రాజ్‌కుమార్‌ సింగ్ డిమాండ్‌ చేయడం వివాదా స్పందంగా మారింది. యోగి ప్రభుత్వం ఆదేశానుసారం అతిక్ అహ్మద్ హత్యకు గురయ్యాడని, దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రాజీనామా చేయాలని..

గ్యాంగ్‌స్టర్‌ అష్రఫ్‌కు భారతరత్న ఇవ్వాలంటూ కాంగ్రెస్‌ నేత డిమాండ్.. ఆరేళ్లు పార్టీ నుంచి బహిష్కరణ
Bharat Ratna For Atiq Ahmad
Srilakshmi C
|

Updated on: Apr 20, 2023 | 10:33 AM

Share

యూపీ గ్యాంగ్‌స్టర్‌ అతిఖ్‌ అహ్మద్‌ , అతడి సోదరుడు అష్రఫ్‌లు హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్‌ ఏప్రిల్ 24న విచారించనుంది. ఈ నేపథ్యంలో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ నేత రజ్జు భయ్యా అలియాస్ రాజ్‌కుమార్‌ సింగ్ డిమాండ్‌ చేయడం వివాదా స్పందంగా మారింది. యోగి ప్రభుత్వం ఆదేశానుసారం అతిక్ అహ్మద్ హత్యకు గురయ్యాడని, దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

సమాజ్‌వాదీ పార్టీనేత ములాయం సింగ్ యాదవ్‌కు పద్మ విభూషణ్ ప్రదానం చేసినప్పుడు, అతిక్ అహ్మద్‌కు భారతరత్న ఎందుకు ఇవ్వలేకపోయారు. అతిక్‌కి జాతీయ గౌరవం ఇవ్వాలి. అతిక్ అమర్ రహే అంటూ నినాదాలు కూడా చేశారు. అనంతరం అతిక్‌ సమాధిపై జాతీయ జెండాను ఉంచి డాన్‌కు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అతిక్ అహ్మద్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. అదే రోజు సాయంత్రమే రాజ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక దీనిపై స్పందించిన ప్రయాగ్‌రాజ్‌ సిటీ కాంగ్రెస్ కమిటీ రాజ్‌కుమార్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. రాజర్‌కుమార్ మానసిక స్థితి సరిగా లేదని, అతిక్‌ హత్యపై ఎలాంటి అవాంఛనీయ ప్రకటన చేయవద్దని కోరినప్పటికీ, పార్టీ సీనియర్ నేతల ఆదేశాలను రాజ్‌ కుమార్‌ ధిక్కరించారు. క్రమశిక్షణారాహిత్యం ఆరోపణలపై రాజ్‌కుమార్‌ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రయాగ్‌రాజ్ సిటీ కాంగ్రెస్ కమిటీ నగర అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ మిశ్రా ‘అన్షుమాన్’ మీడియాకు తెలిపారు. పార్టీ బహిష్కరణ తర్వాత ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. రాజ్‌కుమార్‌ ఇచ్చిన ప్రకటన తన వ్యక్తిగత అభిప్రాయమని, దానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మిశ్రా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.