భార్యభర్తలు విడిపోయారు.. కోర్టులో భర్త చేసిన పనికి అందరూ షాక్
తమిళనాడులోని ఓ కోర్టులో భర్త చేసిన పనికి భార్య బిత్తరపోయింది. వివరాల్లోకి వెళ్తే సేలం జిల్లా కిడయూరు మెట్టూరికి చెందిన రాజీ (57) అనే వ్యక్తి తన భార్య శాంతి తో ఉండేవాడు. అయితే కొన్ని రోజుల క్రితం వీళ్లకి అభిప్రాయభేదాలు రావడంతో విడివిడిగా జీవిస్తున్నారు.
తమిళనాడులోని ఓ కోర్టులో భర్త చేసిన పనికి భార్య బిత్తరపోయింది. వివరాల్లోకి వెళ్తే సేలం జిల్లా కిడయూరు మెట్టూరికి చెందిన రాజీ (57) అనే వ్యక్తి తన భార్య శాంతి తో ఉండేవాడు. అయితే కొన్ని రోజుల క్రితం వీళ్లకి అభిప్రాయభేదాలు రావడంతో విడివిడిగా జీవిస్తున్నారు. అయితే ఈ పరిస్థితిలో తనకు భరణం చెల్లించాలంటూ భార్య శాంతి సంగగిరి 2వ క్రిమినల్ కోర్టలో కేసు వేసింది. అయితే కేసును విచారించిన న్యాయమూర్తి.. శాంతికి ప్రతినెలా రూ. 73000 జీవనభృతిగా చెల్లించాలని ఆదేశించారు. కానీ ఆ మొత్తాన్ని రాజీ సరిగ్గా చెల్లించలేకపోయాడు. దీంతో శాంతి సంగగిరి కోర్టులో మళ్లీ పిటీషన్ దాఖలు చేసింది.
అయితే పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి.. బకాయి మొత్తాన్ని రూ.2.18 లక్షలు వెంటనే చెల్లించాలని రాజీని ఆదేశించారు. అనంతరం బుధవారం రోజున ఉదయం రాజీ తన భార్యకు చెల్లించాల్సిన సొమ్ము రూ.2.18 లక్షలను మొత్తం పది రూపాయల నాణేలతో తీసుకొచ్చాడు. ఆ నాణేలన్నింటిని 11 బస్తాల్లో వేసుకుని కోర్టుకు తీసుకొచ్చాడు. వాటిని చూసి కోర్టులో ఉన్నవారు ఒక్కసారిగా అవక్కాయ్యారు. అయితే రాజీ తన భార్యకు భరణం సొమ్మును చిల్లర రూపంలో ఇచ్చి అవమానపరచాడంటూ కోర్టు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.