ఆ రాష్ట్రంలో జైలు శిక్ష అనుభవించిన వారికి ప్రతినెల రూ.15 వేల పింఛను..
అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1975 లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధి నేతృత్వంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎమర్జెన్సీ సమయంలో తమ రాష్రం నుంచి జైలు శిక్ష అనుభవించిన వ్యక్తులకు ప్రతినెల రూ.15 వేలు పింఛను ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1975 లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధి నేతృత్వంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎమర్జెన్సీ సమయంలో తమ రాష్రం నుంచి జైలు శిక్ష అనుభవించిన వ్యక్తులకు ప్రతినెల రూ.15 వేలు పింఛను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దాదాపు 301 మందికి ఈ పింఛను ఇవ్వనున్నట్లు పేర్కొంది. ప్రజాస్వామ్యం పట్ల వారు చేసిన సహకారాన్ని గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి అశోక్ సింగల్ తెలిపారు.
ఒకవేళ ఎమర్జెన్సీ కాలంలో జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి లేకుంటే ఆ పింఛన్ డబ్బులు అతని భార్యకు అందుతాయని తెలిపారు. ఒకవేళ భార్యభర్తలు ఇద్దరు లేకుంటే.. పెళ్లి కాని వారి కుమార్తెకు ఈ పింఛన్ వర్తిస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ అత్యవరస సమయంలో జైలుపాలైన వ్యక్తులకు పలు రాష్ట్రాలు కూడా పింఛను సహయాన్ని అందిస్తు్నాయని అశోక్ సింగల్ తెలిపారు. కానీ ఆ రాష్ట్రాలతో పోల్చుకుంటే అస్సాం ప్రభుత్వం అత్యధికంగా పింఛను డబ్బులు అందజేస్తుందని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.