AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీడిపప్పు నగరం..! ఇక్కడి రోడ్లపై కుప్పలుగా పోసి కూరగాయలకంటే తక్కువ ధరకే అమ్ముతుంటారు.. ఎక్కడో తెలుసా..?

నేల జీడిపప్పు సాగుకు అనుకూలంగా ఉందని అటవీ శాఖ గుర్తించడంతో జీడి సాగు విషయం అటవీ శాఖ దృష్టికి వచ్చింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున జీడి సాగు చేశారు. చెట్లపై జీడిపండ్లు ఏపుగా పెరిగిన వెంటనే రైతులు వాటిని సేకరించి రోడ్డు పక్కన పావు వంతు ధరకు విక్రయిస్తుంటారు.

జీడిపప్పు నగరం..!  ఇక్కడి రోడ్లపై కుప్పలుగా పోసి కూరగాయలకంటే తక్కువ ధరకే అమ్ముతుంటారు.. ఎక్కడో తెలుసా..?
Cashew City Of India
Jyothi Gadda
|

Updated on: Apr 20, 2023 | 12:01 PM

Share

జీడిపప్పు దాని ఆకృతి, తీపి రుచి కారణంగా అత్యంత ప్రాచుర్యం పొందిన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. ప్రతి ఒక్కరూ జీడిపప్పు తినాలని కోరుకుంటారు. ఇందులోని పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ జీడిపప్పు ధర ఎప్పుడూ ఆకాశాన్నంటుతుంది. దాని ధర కిలోకు 800-1000 రూపాయల దాకా పలుకుతుంది. అయితే భారతదేశంలోనే ఈ కాయలు అతి తక్కువ ధరకు కిలో రూ.30-100కి అమ్ముడవుతున్న ఏకైక ప్రదేశం ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. జార్ఖండ్‌లోని జమ్తారా అని పిలువబడే ఒక జిల్లా ఉంది. దీనిని భారతదేశం ఫిషింగ్ రాజధాని అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఈ ప్రసిద్ధ డ్రై ఫ్రూట్ చాలా తక్కువ ధరకు అమ్ముతుంటారు.

ఈ జమ్తారా పట్టణానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ‘నాలా’ అనే గ్రామం ఉంది. దీనిని జార్ఖండ్‌లోని కజూర్ పట్టణం అని పిలుస్తారు. ఈ గ్రామంలో దేశవ్యాప్తంగా ఉన్న ఇతర కూరగాయల మాదిరిగానే మీరు జీడిపప్పును కిలోకు 20-30 రూపాయలకే కొనుగోలు చెయొచ్చు.

ఇంత తక్కువ ధరకు జీడిపప్పు విక్రయించడానికి మొదటి కారణం గ్రామంలో 50 ఎకరాల భూమి ఉండడంతో గ్రామస్తులు జీడిపంటను పండిస్తున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, 2010 ప్రాంతంలో, నాలా గ్రామంలోని వాతావరణం, నేల జీడిపప్పు సాగుకు అనుకూలంగా ఉందని అటవీ శాఖ గుర్తించడంతో జీడి సాగు విషయం అటవీ శాఖ దృష్టికి వచ్చింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున జీడి సాగు చేశారు. చెట్లపై జీడిపండ్లు ఏపుగా పెరిగిన వెంటనే రైతులు వాటిని సేకరించి రోడ్డు పక్కన పావు వంతు ధరకు విక్రయిస్తుంటారు. ఇక్కడి ప్రాంతం అంతగా అభివృద్ధి చెందకపోవడంతో గ్రామస్థులు ఇంత తక్కువ ధరకు జీడిపప్పును విక్రయిస్తుంటారు.

ఇవి కూడా చదవండి

IAS కృపానంద్ ఝా జమతారా డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నప్పుడు, నాలా నేల, వాతావరణం జీడిపప్పు సాగుకు అనుకూలమని తెలుసుకున్నారు. ఆ విధంగా జీడి చెట్లను నాటేందుకు కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడారు. ఆ తర్వాత అటవీశాఖ చొరవ తీసుకుని నాలాలోని 50 ఎకరాల్లో జీడి మొక్కలు నాటారు. అప్పటి నుండి జార్ఖండ్‌లో జీడిపప్పు సాగు చేయబడుతోంది. అయితే దురదృష్టవశాత్తు రైతులు జీడిపప్పును తక్కువ ధరలకు అమ్మడం వల్ల అది లాభదాయకం లేకుండా పోయింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..