AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రాఫిక్ పోలీసులు మీ వాహనాన్ని ఆపినపుడు ఈ నాలుగు ముఖ్యమైన విషయాలు మర్చిపోవద్దు..!

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రాఫిక్ పోలీసులకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాదు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. మీ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు మీరు జాగ్రత్త వహించాల్సిన నాలుగు విషయాలు ఉన్నాయి. మీరు వాటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

ట్రాఫిక్ పోలీసులు మీ వాహనాన్ని ఆపినపుడు ఈ నాలుగు ముఖ్యమైన విషయాలు మర్చిపోవద్దు..!
Traffic Police Stopes You
Jyothi Gadda
|

Updated on: Apr 20, 2023 | 9:36 AM

Share

కార్లు, బైక్‌లు, స్కూటర్లు, ఆటోలు ఇలా అన్ని రకాల వాహనాలకు ట్రాఫిక్ నిబంధనలు రూపొందించారు. ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటించాలి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రాఫిక్ పోలీసులకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాదు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. మీ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు మీరు జాగ్రత్త వహించాల్సిన నాలుగు విషయాలు ఉన్నాయి. మీరు వాటిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అవి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

1. ప్రశాంతంగా ప్రవర్తించండి:

ట్రాఫిక్ పోలీసులు మీ వాహనాన్ని ఆపమని అడిగితే వెంటనే ఆపండి. తప్పించుకోవడానికి ప్రయత్నించవద్దు. మీ కారు, బైక్ లేదా స్కూటర్‌లో కూర్చోవడం సమస్య కాదు. అయితే వాహనం ఇంజన్ స్విచ్ ఆఫ్ చేయండి. అప్పుడు పోలీసు అధికారితో మాట్లాడండి.

2. సభ్యతను కాపాడుకోండి :

పోలీసులు కూడా మనుషులే అని మర్చిపోకండి. ఎండ, వాన, చలిలో సైతం రోడ్డుపైనే నిలబడి డ్యూటీ చేస్తున్నారు. వారిని గౌరవించండి. మర్యాదతో వ్యవహరించండి. మీరు మర్యాదగా ఉంటే, కేవలం హెచ్చరికతో నియమాలను ఉల్లంఘించిన తర్వాత కూడా మీరు హెచ్చరికతో బయటపడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

3. భయపడవద్దు :

కొన్నిసార్లు మీకు తెలియకుండానే నిబంధనలను ఉల్లంఘిస్తారు. ఈ సందర్భంలో మీరు ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించలేదని, కానీ అనుకోకుండా చేశారని పోలీసు అధికారికి వివరించడానికి ప్రయత్నించండి. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పుకోండి. మీ తప్పుకు క్షమాపణ చెప్పండి.

4. నియమాలను గౌరవించండి :

ఒక నియమాన్ని రూపొందించిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆ నియమాన్ని పాటించాలి. నిబంధనలు అందరికీ ఒకటే. ఈ కోణం నుంచి పోలీసులు ఏం చెబుతున్నారో అర్థం చేసుకోవచ్చు. వారు తప్పుగా అర్థం చేసుకున్నారని మీకు అనిపిస్తే, మీ అభిప్రాయాన్ని వారికి మీరే ఓపికతో వివరించండి.

పోలీసులు మీకు చలానా లేదా జరిమానా విధించే సమయంలో అతని వద్ద చలానా బుక్, ఇ-చలానా మెషీన్ ఉంటేనే చెలనా చెల్లించండి. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి డబ్బు ఇవ్వకండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..