మరోసారి గేదెను ఢీకొన్న వందేభారత్.. గేదె ఎగిరి మీద పడటంతో వ్యక్తి మృతి

మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరూ ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. మృతుడు శివదయాళ్ రైల్వేలో ఉద్యోగ విరమణ పొందాడు. గతంలో అతను ఎలక్ట్రీషియన్‌గా ఉద్యోగం చేసేవాడు.

మరోసారి గేదెను ఢీకొన్న వందేభారత్.. గేదె ఎగిరి మీద పడటంతో వ్యక్తి మృతి
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 20, 2023 | 7:09 AM

మరోసారి వందేభారత్ అవాంఛనీయ కారణాలతో వార్తల్లోకి ఎక్కింది. రాజస్తాన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గేదెను ఢీకొట్టింది. రాజస్తాన్‌లోని అజ్మేర్ నుంచి ఢిల్లీకి నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్.. ఢిల్లీ నుంచి అజ్మేర్‌కు వస్తుండగా బుధవారం రోజు దుర్ఘటన జరిగింది. అల్వార్ జిల్లాలోని కాలిమోరి రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద రైలు గేదెను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి కూడా మరణించాడు. వేగంగా దూసుకెళ్లుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఓ గేదెను ఢీకొట్టింది. వందే భారత్ ట్రైన్ అధిక వేగంతో ఉండటంతో ఆ గేదె గాల్లోకి ఎగిరింది. అదే సమయంలో స్పాట్‌కు సమీపంలోనే ఉన్న ఒక వ్యక్తిపై ఆ గేదె పడింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరణించిన వ్యక్తిని రైల్వే విశ్రాంత ఉద్యోగి అయిన శివ దయాల్‌గా పోలీసులు గుర్తించారు.

శివ దయాల్ మృతదేహాన్ని రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్‌ మార్చురీకి తరలించారు. ఈ ఘటన గురించి శివ దయాల్ కుటుంబానికి సమాచారం అందజేశారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరూ ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. మృతుడు శివదయాళ్ రైల్వేలో ఉద్యోగ విరమణ పొందాడు. గతంలో అతను ఎలక్ట్రీషియన్‌గా ఉద్యోగం చేసేవాడు. మృతుడి కుటుంబ సభ్యులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. ఈ విషయమై రైల్వే అధికారులను సంప్రదిస్తామని మృతుల బంధువులు తెలిపారు.

కాగా, రాజస్తాన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!