కుబేరులకు కేరాఫ్‌ అడ్రస్‌..5 కోట్ల మందికి పైగా మిలియనీర్లు.. వ‌ర‌ల్డ్ రిచెస్ట్ సిటీ ఎక్కడుందంటే.

2000 సంవత్సరం నాటికి ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరంగా పేరొందిన లండన్.. ప్రస్తుత జాబితాలో నాలుగో స్థానానికి పడిపోయింది. లండన్ తర్వాతి స్థానంలో సింగపూర్ నిలిచింది. చైనా రాజధాని బీజింగ్, షాంఘైలకూ ఈ జాబితాలో చోటు దక్కింది.

కుబేరులకు కేరాఫ్‌ అడ్రస్‌..5 కోట్ల మందికి పైగా మిలియనీర్లు.. వ‌ర‌ల్డ్ రిచెస్ట్ సిటీ ఎక్కడుందంటే.
Toprichest City In The Worl
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 19, 2023 | 1:32 PM

మీరు మల్టీ మిలియనీర్ల గురించి విన్నారా..? ఇది ప్రపంచంలోని ఒక నగరం గురించి వార్త. ఇక్కడ కేవలం లక్షాధికారులే 3 లక్షలకు పైగా నివసిస్తున్నారు. అది ఎక్కడో కాదు న్యూయార్క్ సిటీ. న్యూయార్క్ 2023లో అత్యధిక మిలియనీర్లతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరంగా అవతరించింది. గ్లోబల్ వెల్త్ ట్రాకర్ అయిన హెన్లీ & పార్ట్‌నర్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరంగా న్యూయార్క్ సిటీ మరోసారి నిలిచింది. ఈ మేరకు 2023 ఏడాదికి సంబంధించి ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్ లో న్యూయార్క్ మళ్లీ టాప్ లో నిలిచింది.

అమెరికాలోని న్యూయార్క్ లో ఏకంగా 3.40 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారని తెలిపింది. వంద మిలియన్ డాలర్లకు పైబడి (సెంటి మిలియనీర్స్) ఆస్తులు ఉన్న వారి సంఖ్య 724 కాగా.. 58 మంది బిలియనీర్లు కూడా ఈ నగరంలో ఉంటున్నారని తెలిపింది. అమెరికాలోని నాలుగు సిటీలు న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిలిస్, షికాగోలకు ఈ జాబితాలో చోటు దక్కింది.

ప్రపంచంలోని అత్యంత ధనిక నగరాల పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో మొత్తం 97 నగరాలకు చోటు దక్కింది. న్యూయార్క్ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానంలో జపాన్ రాజధాని టోక్యో నిలిచింది. ఇక్కడ 2.90 లక్షల మంది మిలియనీర్లు నివసిస్తున్నారని హెన్లీ అండ్ పార్ట్ నర్స్ తన రిపోర్టులో పేర్కొంది. మూడో స్థానాన్ని శాన్ ఫ్రాన్సిస్కో దక్కించుకుంది. ఈ సిటీలో 2.85 లక్షల మంది మిలియనీర్లు ఉన్నారని తెలిపింది.

ఇవి కూడా చదవండి

2000 సంవత్సరం నాటికి ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరంగా పేరొందిన లండన్.. ప్రస్తుత జాబితాలో నాలుగో స్థానానికి పడిపోయింది. లండన్ తర్వాతి స్థానంలో సింగపూర్ నిలిచింది. చైనా రాజధాని బీజింగ్, షాంఘైలకూ ఈ జాబితాలో చోటు దక్కింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?