AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎత్తైన వంతెనపై నిర్మించిన అందమైన నగరం.. రంగు రంగుల ఇళ్లతో అద్బుత దృశ్యం.. వీడియో వైరల్..

''వావ్. ఏమీ దృశ్యం. మంచి వెంటిలేషన్‌తో సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని ఆస్వాదించవచ్చు.అంటూ కొందరు సంతోషంగా కామెంట్ చేస్తుంటే, మరికొందరు వంతెన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకొందరు..

ఎత్తైన వంతెనపై నిర్మించిన అందమైన నగరం.. రంగు రంగుల ఇళ్లతో అద్బుత దృశ్యం.. వీడియో వైరల్..
Unique Town
Jyothi Gadda
|

Updated on: Apr 19, 2023 | 11:37 AM

Share

ఓ విభిన్నమైన అందమైన నగరం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో వివిధ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన అనేక నగరాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ నగరాన్ని నిర్మించే విధానంలో కూడా తేడా ఉంటుంది. ఇది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ ఇళ్ళు ఒక ఎత్తైన వంతెన పైన నిర్మించబడ్డాయి. ఇది చైనాలోని చాంగ్‌కింగ్ లిన్షి నగరంలో ఇళ్లు వంతెనపై నిర్మించబడ్డాయి. ఇందులో సాంప్రదాయ భవనాలు, పాశ్చాత్య శైలి ఆధునిక భవనాలు ఉన్నాయి. వీడియో వంతెన పైన ఉన్న అనేక రకాల ఇళ్లను చూపుతుంది. వీటిలో రకరకాల రంగులు, ఆకారాల ఇళ్లు ఉన్నాయి. వంతెన కింద అందమైన నది కూడా ప్రశాంతంగా ప్రవహిస్తోంది.

భవనాల ఆకృతిలో తేడాలు ఉన్నప్పటికీ, అవన్నీ ఒకే వరుసలో నిర్మించబడ్డాయి. అలాగే భవనాలు నీలం, గులాబీ, తెలుపు వంటి చాలా విభిన్న రంగులలో ఉన్నాయి. ఈ వంతెన చుట్టూ అందమైన పర్వతాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా సుందర దృశ్యమే అని చెప్పాలి. ఈ ప్రాంతాన్ని నిర్వహించడానికి, పర్యాటకులను ఆకర్షించడానికి వంతెన పైన ఒక నగరాన్ని సృష్టించినట్లు ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ నగరానికి సంబంధించిన వీడియోను వ్యాపారవేత్త హర్ష గోయెంకా తన ట్విట్టర్ ఖాతాలో షేర్‌చేయగా, ఇప్పుడా వీడియో వైరల్‌ అవుతోంది. “ఇమాజిన్ లివింగ్ హియర్’ అనే క్యాప్షన్‌తో వీడియోను పోస్ట్ చేశారు. ఈ నగరం చాలా మందిని ఆకర్షిస్తుంది. వైరల్ అవుతున్న వీడియోతో ఈ అందమైన నగరానికి చాలా మంది ప్రజలు తరలి వస్తారనడంలో సందేహం లేదు.

ఇవి కూడా చదవండి

పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తన సోషల్ మీడియా అభిమానులను వినోదభరితంగా ఉంచడానికి తరచుగా ప్రేరణాత్మక, ఆసక్తికరమైన పోస్ట్‌లను షేర్‌ చేస్తుంటారు. అతని చమత్కారమైన, హాస్యభరితమైన ట్వీట్‌లు ఆన్‌లైన్‌లో ఎక్కవ మంది నెటిజన్లకు ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఈ వీడియోపై కూడా నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ”వావ్. ఏమీ దృశ్యం. మంచి వెంటిలేషన్‌తో సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని ఆస్వాదించవచ్చు.అంటూ కొందరు సంతోషంగా కామెంట్ చేస్తుంటే, మరికొందరు వంతెన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకొందరు.. ”సర్ బహుశా, బ్రిడ్జి దాని పైభాగంలో ఇళ్ళు నిర్మించడానికి కాదు ప్రయాణించడానికి కదా..!ఇది ప్రకృతి ధర్మానికి విరుద్ధం, ప్రజలు చెత్తను, వ్యర్థాలను నదిలో వేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..