- Telugu News Photo Gallery Bicycle With Square Wheels Incredible Innovation an engineer made square tyre for bicycle but not as usual round tyre Telugu News
ఇదేక్కడి వింతండోయ్..! చతురస్ర్తాకారంలో సైకిల్ చక్రాలు.. ఎలా నడుస్తుందంటే..
ప్రస్తుత మంతా ఇంటర్ నెట్ యుగం, విపరీతంగా పెరిగిపోయిన టెక్నాలజీ సాయంతో..ఎంతోమంది ఎన్నో రకాల కొత్త వస్తువుల్ని కనిపెడుతున్నారు. కొందరు పాత వాటికే కొత్త హంగుల్ని అద్దుతున్నారు. తాజాగా సెర్గీ గోర్డీయేవ్ అనే ఇంజనీర్ నార్మల్‌గా ఉండే సైకిల్ చక్రాల ఆకారంలో కాకుండా చతురస్రాకారంలో ఉండే చక్రాలను సృష్టించాడు. ఈ చక్రాల ఆకారం మార్పుతో తెచ్చిన సైకిల్ కొత్త ఆవిష్కరణ చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.
Updated on: Apr 19, 2023 | 9:17 AM

గుండ్రటి ఆకారంలో సైకిల్ చక్రాలు ఉంటాయి. కానీ చతురస్త్రాకారంలో సైకిల్ చక్రాలు ఉండడం ఎప్పుడైనా చూశారా..? కానీ, ఇక్కడ సెర్గీ అనే ఇంజనీర్ సృష్టించిన సైకిల్ చక్రాలు చతురస్రాకారంలో ఉండి నెటింట తెగ హల్‌చల్ చేస్తోంది.

ఈ సైకిల్ చక్రాలు రెగ్యులర్ గా ఉండే గుండ్రటి ఆకారం వీల్స్‌లా కాకుండా ఎంతో సామర్ధ్యంగా పనిచేస్తాయని ఇంజనీర్ చెబుతున్నాడు. మాసిమో అనే ట్విట్టర్ యూజర్ ఈ కొత్త మోడల్ సైకిల్‌కి సంబంధించిన వీడియోని షేర్ చేసాడు. ఒక్క వీల్స్ తప్ప మిగతా అంతా నార్మల్ సైకిల్ మాదిరిగానే ఉంది. ప్రస్తుతం ఈ సైకిల్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలు చూస్తే దాని రహస్యం మీకే తెలుస్తుంది. ఈ సైకిల్ చతురస్రాకారపు చక్రాలు మిలిటరీ ట్యాంక్ లాగా పనిచేస్తాయి. అంటే, దాని చదరపు చక్రం వేరు చేయగలిగిన చైన్ సిస్టమ్ కలిగి ఉంటుంది. దానివల్ల చక్రం ముందుకు సాగుతుంది!

వీడియోను షేర్ చేస్తూ.. మాస్సిమో ఇలా వ్రాశాడు - ఈ ప్రత్యేకమైన సైకిల్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఆసక్తికరమైన వీడియోలో సరళంగా కనిపించే నల్లని సైకిల్‌ను చూడవచ్చు. చతురస్రాకార టైర్లతో సైకిల్‌పై కూర్చొని తొక్కుతున్న వ్యక్తి కూడా ఈజీగా వెళ్తున్నాడు.. అతను పెడల్ చేసినప్పుడు అది సాఫీగా కదులుతుంది. ఇది నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియోపై జనాలు తీవ్రంగా స్పందించారు.