- Telugu News Photo Gallery The Auto World Exhibition of Vintage Cars, this museum houses a total of 112 vintage cars, 12 buggies and sports vintage cars. Telugu News
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. పాతకాలపు కార్లతో అద్భుత మ్యూజియం.. ఒక్కసారైనా చూడాల్సిందే..!
ఈ మ్యూజియంలో మొత్తం 112 పాతకాలపు కార్లు, 12 బగ్గీలు, స్పోర్ట్ వింటేజ్ కార్లు కూడా ఉన్నాయి. అద్భుతమైన పాతకాలపు కార్లతో నిండిన ఈ మ్యూజియం ఇక్కడకు విచ్చేసిన ప్రతి సందర్శకులచే ప్రశంసించబడుతుంది.
Updated on: Apr 19, 2023 | 2:01 PM

ఈ కారు పేరు mercedes benz 300 (Automatic), ఇది పూర్తిగా ఆటోమేటిక్ కారు. ఈ కారును 1955లో నిర్మించారు. ఈ కారు కోచ్‌వర్క్ క్యాబ్రియోలెట్ స్టైల్. రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్ ఈ వాహనాన్ని ఉపయోగించేవారు.

భోగిలాల్ తన సేకరణలోని వివిధ కార్లకు వేర్వేరు పేర్లను పెట్టాడు. అందులో 1926 రోల్స్ రాయల్ ఫాంటమ్ I అనే పేరు ఆజాద్ త్రివర్ణ పతాకంతో చిత్రించబడి ఉంది.

అద్భుతమైన పాతకాలపు కార్లతో నిండిన ఈ మ్యూజియం ప్రతి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక్కడ మరొక ముఖ్యాంశం 1937 మేబ్యాక్ SW38. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు. మిస్టర్ మేబ్యాక్ యాజమాన్యంలో ఉంది.

1937 రిలే స్ప్రైట్ స్పోర్ట్స్, 1946 సన్‌బీమ్ టాల్బోట్ వంటి స్పోర్ట్స్ కార్లు కూడా ప్రదర్శనలో ఉన్నాయి. అలాగే 12 బగ్గీలు, మూడు మోటార్‌సైకిళ్లు కూడా ప్రదర్శనలో ఉన్నాయి.

ఇక్కడి కార్లలో అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బెల్జియం దేశాల అద్భుతాలు కూడా ఏర్పాటు చేశారు.

మ్యూజియంలో 1936 ఫాంటమ్ III, 1937 ఫాంటమ్ III, 1949 రోల్స్ రాయల్, 1923 సిల్వర్ ఘోస్ట్ మరియు 1927 ఫాంటమ్ I లిమోసిన్ బాడీ విండోవర్స్‌తో సహా రోల్స్ రాయల్స్ అద్భుతమైన సేకరణ ఉంది. అహ్మదాబాద్‌లోని దస్తాన్ ఫామ్‌లోని ఆటోవరల్డ్ మ్యూజియంలో ఈ లగ్జరీ కారును చూడవచ్చు.




