- Telugu News Photo Gallery Cinema photos Shah Rukh Khan family photos with Suhana Aryan Gauri Khan goes viral
Shah Rukh Khan: ఫొటోషూట్‌లో మెరిసిన షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా కూతురు సుహానా..
పఠాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ కాన్. ఈ జోష్‌ను కొనసాగిస్తూ వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. అదే సమయంలో తన ఫ్యామిలీకి తగిన సమయాన్ని కేటాయిస్తున్నాడు.
Updated on: Apr 19, 2023 | 1:52 PM

పఠాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ కాన్. ఈ జోష్‌ను కొనసాగిస్తూ వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. అదే సమయంలో తన ఫ్యామిలీకి తగిన సమయాన్ని కేటాయిస్తున్నాడు.

మరోవైపు ఐపీఎల ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కో ఓనర్‌గా వ్యవహరిస్తున్నాడు. తన ఫ్యామిలీతో కలిసి ఐపీఎల్ మ్యాచ్‌లకు హాజరవుతూ అభిమానులను ఉత్సాహపరుస్తున్నాడు.

కాగా షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ తమ కుటుంబంతో కలిసి తాజాగా ఓ ఫొటోషూట్లో పాల్గొన్నారు. ఇందులో వారి పిల్లలు పిల్లలు అబ్రామ్, ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గౌరీ ఖాన్ ఇంటీరియర్ డిజైనర్‌గా బిజీగా ఉంటోంది. అలాగే తన భర్త సినిమా వ్యవహారాల్లో అండగా నిలుస్తోంది. ఇక షారుఖ్ ఖాన్-గౌరీ ఖాన్ దంపతుల పిల్లలు కూడా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు.

ముఖ్యంగా సుహానా ఖాన్ ఇప్పటికే బోలెడంత క్రేజ్ సంపాదించుకుంది. అలాగే పలు ప్రతిష్టాత్మక బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఇక కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా త్వరలోనే సినిమాల్లోకి రానున్నట్లు సమాచారం.




