Solar Eclipse: నేడు రాహుగ్రస్త సూర్యగ్రహణం.. కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం.. దోషం తొలగడానికి ఏఏ దానాలు చేయాలంటే..

మేష రాశి, అశ్విని నక్షత్రంలో ఏర్పడిన ఈ సూర్యగ్రహణం రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం ప్రతికూల ప్రభావాన్ని కలిగించనుంది.  ఈ నేపథ్యంలో సూర్యగ్రహణ దోషం పోవడానికి ఆయా రాశుల వారు కొన్ని దానాలు చేయాల్సి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రోజు ఏ ఏ రాశులవారు ఏయే వస్తువులు దానం చేయడం వలన గ్రహణ దోషం తొలగిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..  

Solar Eclipse: నేడు రాహుగ్రస్త సూర్యగ్రహణం.. కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం.. దోషం తొలగడానికి ఏఏ దానాలు చేయాలంటే..
Solar Eclipse 2023
Follow us
Surya Kala

|

Updated on: Apr 20, 2023 | 9:00 AM

ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏర్పడింది. అంతరిక్షంలో అరుదైన హైబ్రిడ్ సూర్యగ్రహణం దర్శనం అయింది. హిందూ మతంలో గ్రహణాల ప్రభావం వ్యక్తుల జీవితంపై చూపిస్తాయని.. మంచి చెడులను కలిగిస్తాయని నమ్మకం. గ్రహణ సమయంలో ఏర్పడిన రాశి ప్రకారం.. ఆయా రాశులపై ప్రభావం చూపిస్తాయని విశ్వాసం. ఆయా వ్యక్తుల జాతకాలపై ప్రభావం చూపిస్తాయి. ఈ రోజు ఏర్పడిన సూర్య గ్రహణం వలన కొన్ని రాశులకు మంచి జరిగితే.. మరికొందరికి చేడు జరగనుంది.

మేష రాశి, అశ్విని నక్షత్రంలో ఏర్పడిన ఈ సూర్యగ్రహణం రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం ప్రతికూల ప్రభావాన్ని కలిగించనుంది.  ఈ నేపథ్యంలో సూర్యగ్రహణ దోషం పోవడానికి ఆయా రాశుల వారు కొన్ని దానాలు చేయాల్సి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రోజు ఏ ఏ రాశులవారు ఏయే వస్తువులు దానం చేయడం వలన గ్రహణ దోషం తొలగిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. మేష రాశి: ఈ రాశివారు గ్రహణ దోషం ఇబ్బంది పెట్టకుండా ఎరుపు రంగు వస్తువులను దానం చేయాలి. ఆహార పదార్థాలు,  బట్టలు వంటి ఎరుపు రంగు వస్తువులతో పాటు బెల్లం వంటి వాటిని కూడా దానం చేయాల్సి ఉంది.
  2. వృషభ రాశి: ఈ రాశివారు తెల్లటి వస్తువులను దానం చేయాలి.  పాలం, పెరుగు, పంచదార, అన్నం వంటి ఆహార పదార్థాలతో పాటు  కర్పూరాన్ని కూడా దానం చేయవచ్చు. తెల్లటి వస్త్రాలు కూడా దానం చేయడం వలన గ్రహణ దోషం  నివారింపబడుతుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. మిధున రాశి: ఈ రాశివారు సూర్య గ్రహణం విడిచిన అనంతరం ఆకు పచ్చని వస్తువులను దానం చేయాలి.  కూరగాయలు, పచ్చిబఠానీలు లేదా పచ్చని బట్టలు దానం చేయవచ్చు.
  5. సింహ రాశి: ఈ రాశివారు ఎరుపు రంగు లేదా నారింజ రంగు వస్తువులను, రాగి పాత్రలను, బెల్లం, గోధుమలు వంటి ఆహార పదార్థాలను  దానం చేయడం వలన గ్రహణ దోషం తొలగిపోతుంది.
  6. కర్కాటక రాశి : ఈ రాశివారు సూర్య గ్రహణం విడిచిన తర్వాత తెల్లటి వస్తువులను దానం చేయాలి. అన్నం, పాలు, తెల్లని స్వీట్లు దానం చేయాలి. ముత్యాలు, తెల్లని వస్త్రాలు కూడా దానం చేస్తే మంచిది.
  7. కన్య రాశి: ఈ రాశివారు కూరగాయలను దానం చేస్తే మంచిది.  ఆవుకు ఆహారం అందించడం మంచిది. దుర్గాదేవికి ఎర్రటి వస్త్రాన్ని సమర్పిస్తే గ్రహణ దోషం తొలగిపోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)