Solar Eclipse 2023: సూర్య గ్రహణంతో ఆ నాలుగు రాశుల వారికి అదృష్ట యోగం.. అందులో మీరున్నారా?..
ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం కొన్ని రాశుల వారికి అదృష్ట యోగాన్ని తీసుకురానుంది. గ్రహణ ఫలితాలు సాధారణంగా 40 రోజుల లోపల అనుభవానికి వస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబు తోంది. సూర్య,గ్రహణానికైనా, చంద్ర గ్రహణా నికైనా ఫలితాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి.
గ్రహణం వల్ల ఏదో అరిష్టం జరగబోతుందని, గ్రహణం సంభవించినప్పుడు తప్పనిసరిగా పరిహారం చేయించుకోవలసి ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. గ్రహణం అనేది ఖగోళ శాస్త్రం ప్రకారం భూమి, రవి, చంద్రగ్రహాల వల్ల ఏర్పడుతుంటాయి. జ్యోతిష శాస్త్రంలో ఈ గ్రహణాలు సూర్యచంద్రులతో రాహుకేతువులు కలవడం వల్ల సంభవిస్తుంటాయి. గ్రహణ ఫలితాలు సాధారణంగా 40 రోజుల లోపల అనుభవానికి వస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబు తోంది. సూర్య,గ్రహణానికైనా, చంద్ర గ్రహణా నికైనా ఫలితాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. తేడా చాలా తక్కువ అని చెప్పాలి. ఈ గ్రహణాల వల్ల కొన్ని రాశుల వారికి యోగం పడుతుండగా మరికొన్ని రాశుల వారికి అవయోగం పట్టడం సహజంగా జరుగుతుంటుంది.
చెడు ఫలితాలు..
నిజానికి ఈ సూర్య చంద్ర గ్రహణాల వల్ల పెద్దగా నష్టం జరిగే అవకాశం లేదనే చెప్పాలి. కొద్దిపాటి అనారోగ్యాలకు, శ్రమకు, తిప్పటకు, ఒత్తిడికి మాత్రమే అవకాశం ఉంటుంది. గ్రహణాల వల్ల చోటు చేసుకునే చెడు ఫలితాలు తాత్కాలికం మాత్రమే. ఉదాహరణకు ఈ నెల 20న మేష రాశిలో సంభవించబోయే పాక్షిక సూర్యగ్రహణం వల్ల ఈ రాశి వారికి పెద్దగా నష్టమేమి జరగక పోవచ్చు. ఈ రాశిలో రవిగ్రహం ఉచ్ఛ పట్టడం ఈ రాశి చంద్రగ్రహానికి మిత్ర స్థానం కావడం వల్ల గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు. తులా రాశి వారికి సప్తమ స్థానంలో పడుతున్న ఈ గ్రహణం వల్ల అంతగా నష్టం జరిగే అవకాశం లేదు. సాధారణంగా వ్యక్తిగత జాతకాలలో గ్రహణం పట్టినవారు, అంటే గ్రహణ సమయంలో పుట్టిన వారికి కొన్ని రాజయోగాలు పట్టే అవకాశం ఉండదు. జాతక చక్రంలో రాజయోగాలు ఉన్నప్పటికీ గ్రహణం గనుక ఉండే పక్షంలో ఆ యోగాలు విఫలం అవుతాయి.
మంచి ఫలితాలు
మేష రాశిలో గురువారం (ఏప్రిల్ 20న) చోటు చేసుకుంటున్న సూర్యగ్రహణం వల్ల మిధునం, కర్కాటకం, ధనస్సు, కుంభరాశుల వారికి కొద్దిగా అదృష్ట యోగం పట్టే అవకాశం ఉంది. ఆర్థికంగా కలిసి రావడం, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం, రాదనుకున్న డబ్బు చేతికి అందడం, ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇవ్వడం వంటివి చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. జీవితంలో అకస్మాత్తుగా శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో ఊహించని విధంగా మార్పులు జరుగుతాయి. మొత్తానికి ఆకస్మిక మార్పులకు గ్రహణాలు దోహదం చేస్తాయని చెప్పవచ్చు. సాధారణంగా గ్రహణం రోజున ఆదిత్య హృదయం పఠించడం లేదా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వంటివి ఎటువంటి దోషాలనైనా పోగొడతాయి. పైన పేర్కొన్న నాలుగు రాశుల వారికి ఈ పాక్షిక సూర్యగ్రహణం ఏ విధంగా యోగం కలిగిస్తుందో ఇక్కడ పరిశీలిద్దాం.
- మిథున రాశి: ఈ రాశి వారిలో అకస్మాత్తుగా అధిక సంపాదన మీద ఆసక్తి పెరుగుతుంది. ఏదో విధంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన కలుగుతుంది. దీనికి తగ్గట్టే సంపాదన కూడా బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పెద్ద ఎత్తున సాను కూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుం టాయి. చిన్న చిన్న ప్రయత్నాలతో భారీగా సంపాదన పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కి, అధికారానికి అవకాశం ఉంది. సమాజంలో పలుకుబడి జరుగుతుంది. రియల్ ఎస్టేట్ బ్యాంకింగ్ వడ్డీ వ్యాపారం ఆర్థిక లావాదేవీలు షేర్లు బంగారం వంటివి వ్యక్తిగత సంపదను బాగా పెంచే సూచనలు ఉన్నాయి. సాధారణంగా గ్రహణ ఫలితాలు 40 రోజుల లోపల అనుభవానికి వస్తాయి.
- కర్కాటక రాశి: ఈ రాశి వారికి పదవ స్థానంలో గ్రహణం పట్టడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు దూరప్రాంతాలలో ఉన్న కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో భారీగా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. గృహ యోగానికి ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోవచ్చు. ఆరోగ్యంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. శరీర దారుఢ్యం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. చదువుల్లో ఊహించని విధంగా విజయాలు వరిస్తాయి. దూర ప్రయాణాలకు, విహార యాత్రలకు అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
- ధనుస్సు రాశి: ధను రాశి వారికి ఐదవ స్థానంలో సంభవిస్తున్న గ్రహణం వల్ల వీరి ప్రతిభాపాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి వారి సలహాలు సూచనలు అందరికీ నచ్చుతాయి. ప్రయోజనం కూడా కలిగిస్తాయి. వీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఎంతగానో సత్ఫలితాలను పొందుతారు. వృత్తి, ఉద్యోగాలలో సలహాదారులుగా, ప్రణాళిక కర్తలుగా, ప్లానర్లుగా ఉన్నవారు మంచి గుర్తింపుతో పాటు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారనీ చెప్ప వచ్చు. ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభవార్త వినడం జరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. భాగ స్వామ్య వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు సఫలం కావచ్చు.
- కుంభ రాశి: ఈ రాశి వారికి మూడవ స్థానంలో గ్రహణం సంభవించడం వల్ల వృత్తి ఉద్యోగాలపరంగా ఏ ప్రయత్నం చేసినా తప్పకుండా శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. ఏ పని విషయంలో అయినా ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఏ ప్రయత్నం చేసినా కలసి వస్తుంది. విక్రమ స్థానంలో గ్రహణం సంభవించడం వల్ల చొరవ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఇనుమడి స్తుంది. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. స్నేహితులు, సన్నిహితులు, సహచరుల నుంచి అన్ని విషయాలలోనూ సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. మంచి ఉద్యోగానికి మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు చేతికి అంది వస్తాయి. ముఖ్యమైన పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. ఏలినాటి శని ప్రభావం చాలావరకు తగ్గుతుంది.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..