AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ రాశుల అమ్మాయిలతో జర జాగ్రత్త..! గయ్యాళి భార్యలుగా మారతారు.!!

వివాహ బంధం బలపడాలంటే.. భార్యాభర్తల మధ్య ఒకరినొకరు అర్ధం చేసుకునే గుణం తప్పనిసరి. కొంచెం ప్రేమ.. కొంచెం ఇష్టం లేని చోట..

Zodiac Signs: ఈ రాశుల అమ్మాయిలతో జర జాగ్రత్త..! గయ్యాళి భార్యలుగా మారతారు.!!
Solar Eclipse 2023
Ravi Kiran
|

Updated on: Apr 20, 2023 | 6:27 PM

Share

వివాహ బంధం బలపడాలంటే.. భార్యాభర్తల మధ్య ఒకరినొకరు అర్ధం చేసుకునే గుణం తప్పనిసరి. కొంచెం ప్రేమ.. కొంచెం ఇష్టం లేని చోట ఏ బంధమూ బలపడదు. అయితే కొన్ని జంటలు మాత్రం ఎంత ప్రయత్నించినా.. తమ వివాహ బంధాన్ని చివరి వరకు కొనసాగించలేరు. అటు భర్త.. ఇటు భార్య.. ఇద్దరిలో ఎవరొకరు తమ భాగస్వామిపై పెత్తనం చెలాయించాలని అనుకుంటారు. తమ మాటే ఇంట్లో వేదవాక్కుగా నిలవాలని భావిస్తారు. అలాంటి సూపీరియారిటీ ఈగోలు ఉన్నవారు తమ బంధాన్ని ముందుకు కొనసాగించలేరు. ఇదిలా ఉంటే.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. పన్నెండు రాశులు.. వ్యక్తుల వ్యక్తిత్వాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మరి గయ్యాళి భార్యలుగా మారే అమ్మాయిలు ఏ రాశులవారో ఇప్పుడు తెలుసుకుందామా..!

  • సింహరాశి:

ఈ రాశి అమ్మాయిలతో జర జాగ్రత్త. వారు ఎప్పుడూ ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. ఇక వారి అసహనం కారణంగా.. అప్పుడప్పుడూ ఈ రాశి అమ్మాయిలు నిగ్రహం కోల్పోయి.. కోపోద్రిక్తులైపోతారు. వీరికి తమ భాగస్వాములతో తమ కోరికలను ఎలా నెరవేర్చుకోవాలో బాగా తెలుసు. సూపీరియారిటీని ప్రదర్శిస్తూ తమను తాము బెస్ట్ అని అనుకుంటారు.

  • వృశ్చిక రాశి:

ఈ రాశి అమ్మాయిలు తమ ప్రవర్తన రీత్యా చాలా రహస్యాలను బయటకు చెప్పరు. అందుకే కొన్నిసార్లు వారి నిజమైన ఉద్దేశాలు ఏంటో స్పష్టంగా తెలియవు. ఆమె ఎంతో కేరింగ్, కూల్ అని అనిపించవచ్చు.. కానీ కొన్ని నిమిషాల్లోనే తన ఆలోచనల్లో మునిగిపోతుంది. తన జీవిత భాగస్వామి విజయాన్ని ఈ రాశి అమ్మాయిలు ఆస్వాదిస్తారు. కానీ ఎప్పుడైతే.. ఆమె గెలుపు.. తన భాగస్వామి విజయంతో ఓవర్‌షేడ్ అయినప్పుడు మాత్రం సమస్యలు వచ్చిపడతాయి. జీవిత భాగస్వామి వృత్తిపరంగా ఆమెను అధిగమించినట్లయితే, ఆమె వారిని హృదయపూర్వకంగా విషెస్ చెప్పకపోవచ్చు. ఈ రాశి అమ్మాయిలు పెళ్లి తర్వాత తామే భాగస్వామిపై సూపీరియారిటీని ప్రదర్శించాలని భావిస్తారు.

  • ధనుస్సు రాశి:

ఈ రాశి అమ్మాయిలు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు.. తమ స్వరమే గట్టిగా ఉండాలని అనుకుంటారు. తమ జీవిత భాగస్వామితో మాట్లాడినప్పుడు, వారు తమ అభిప్రాయానికి మద్దతు ఇచ్చేలా.. వారిని మారుస్తారు. ముక్కుసూటిగా ఉండే ఈ రాశి అమ్మాయిలు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెబుతారు. అలాగే తమకు నచ్చినవి జరిగేలా జీవిత భాగస్వాములను ఏమారుస్తారు. ఈమె తీసుకునే కొన్ని నిర్ణయాలు.. వారి భాగస్వాములకు అస్సలు నచ్చదు.

  • మేషరాశి:

ఈ రాశి అమ్మాయిలు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. భర్తలపై తమ అధిపత్యాన్ని చేలయిస్తారు. వీరికి షాపింగ్ చేయడమంటే చాలా ఇష్టం. అన్ని చోట్లా వీరి మాటే నెగ్గాలి.. లేదంటే ఆ బంధం వన్ సైడెడ్ అయిపోతుంది.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మతపరమైన ..జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఇవ్వడం జరిగింది.)