Madhura Meenkashi: మీనాక్షి ఆలయంలో దొంగలు.. వజ్రాల కిరీటం, నగలు మాయం.. 20ఏళ్లుగా జరగని ఆడిటింగ్
మధురై మీనాక్షి, ఎంతో మహిమాన్వితమైన దేవతామూర్తి, తమిళనాడులోని కలవేగాయి నదిఒడ్డున కొలువై ఉందీ జగన్మాత. అమ్మా మమ్మల్ని కాపాడు, తమ కష్టాలు తీర్చామ్మా అంటూ వచ్చే కోట్లాదిమంది భక్తులకు అభయహస్తమిస్తోంది ఆ తల్లి. అంతటి శక్తివంతమైన మీనాక్షి అమ్మవారికే ఇప్పుడు కష్టమొచ్చింది.
మధుర మీనాక్షి టెంపుల్‌లో నగలు మాయం తమిళనాట కలకలం రేపుతోంది. వజ్రాల కిరీటం మిస్సైందన్న ప్రచారం పెను సంచలనం సృష్టిస్తోంది. అసలు, అమ్మవారి సంపదెంతో చెప్పాలంటూ ఆర్టీసీ అస్త్రం సంధించడంతో అక్రమాల డొంక కదిలింది. ఇంతకీ, మదురై మీనాక్షి టెంపుల్‌లో అసలేం జరుగుతోంది. వజ్రాలు, కిరీటాలు మాయం చేసిందెవరనేది ఇప్పుడు అందరి మదిలోనూ ఓ ప్రశ్న కలుగుతుంది. మధురై మీనాక్షి, ఎంతో మహిమాన్వితమైన దేవతామూర్తి, తమిళనాడులోని కలవేగాయి నదిఒడ్డున కొలువై ఉందీ జగన్మాత. అమ్మా మమ్మల్ని కాపాడు, తమ కష్టాలు తీర్చామ్మా అంటూ వచ్చే కోట్లాదిమంది భక్తులకు అభయహస్తమిస్తోంది ఆ తల్లి. అంతటి శక్తివంతమైన మీనాక్షి అమ్మవారికే ఇప్పుడు కష్టమొచ్చింది. వినడానికి వింతగానే ఉన్నా ఇది నిజం. అవును, తనను ఆశ్రయించే భక్తులను కాపాడే మధురై మీనాక్షి అమ్మవారికే శఠగోపం పెడుతున్నారు కేటుగాళ్లు.
మధురైలో 2500ఏళ్ల క్రితం కొలువుదీరిన మీనాక్షి అమ్మవారి సంపద ఆపారం. 15 ఎకరాల్లో విస్తరించి ఉందీ టెంపుల్. 16 గోపురాలతో అత్యద్భుత నిర్మాణశైలి ఈ ఆలయం సొంతం. ఇవన్నీ ఒకెత్తు, అమ్మవారి సంపద ఇంకో ఎత్తు. వజ్ర వైఢూర్యాలు, బంగారు నగలు, కిరీటాలు… వీటన్నింటినీ మించి వేలాది ఎకరాల భూములు మీనాక్షి అమ్మవారి సొంతం. కానీ, ఇవన్నీ ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. అవును, అమ్మవారికే తెలియకుండా విలువైన సంపదను కాజేస్తున్నారు దుర్మార్గులు. లేటెస్ట్‌గా వజ్రాల కిరీటం మాయమవడం తమిళనాట సంచలనం రేపుతోంది.
మధురై మీనాక్షి అమ్మవారి సంపద ఎంత?, గతంలో ఎంత ఉండేది-ఇప్పుడెంత ఉంది?, బంగారు నగలెన్ని? వజ్రాల కిరీటాలెన్ని?, అమ్మవారికున్న భూములెన్ని?, బ్యాంకుల్లో దాచిన సంపదెంత?, ఆలయ ఆదాయం ఎంత?… ఇలా అనేక ప్రశ్నలతో ఆర్టీఐ అస్త్రం సంధించాయి హిందూ సంఘాలు. అయితే, తమ దగ్గర లెక్కలు లేవంటూ చేతులెత్తేశారు అధికారులు.
అమ్మవారి సంపద ఎంతో… అధికారుల దగ్గర లెక్కలు లేకపోవడం అనుమానాలకు దారి తీసింది. దాంతో, వజ్రాల కిరీటమే కాదు, ఆలయంలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు భక్తులు. 20ఏళ్లుగా ఆలయ సంపదను లెక్కించకపోవడం వెనక మతలబు ఏంటో అంతుబట్టడం లేదంటున్నారు భక్తులు. హిందూ సంఘాలు ఆర్టీఐ అస్త్రం సంధించడంతో కలెక్టర్ సీన్‌లోకి వచ్చారు. మధురై మీనాక్షి అమ్మవారి సంపద ఎంతో చెప్పాలంటూ ఆదేశించారు. కానీ, ఆలయ అధికారుల నుంచి సరైన ఇన్ఫర్మేషన్ రాలేదన్నది మధురైలో వినిపిస్తోన్న మాట. అందుకే, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటున్నారు భక్తులు. వెంటనే ఆడిటింగ్ జరిపించి యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వజ్రాల కిరీటం మాయమైందనేది ప్రధాన ఆరోపణ. దీంతోపాటు ఆలయంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయంటున్నారు భక్తులు. నగలు, కిరీటాలతోపాటు కోట్ల రూపాయలను మాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పైగా, 20ఏళ్లుగా ఆడిటింగ్ చేయకపోవడంపై అనేక అనుమానాలు. ఇంకోవైపు అమ్మవారి సంపద ఎంతంటే లెక్కచెప్పని అధికారులు. ఇవన్నీ, భక్తుల్లో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం అంటున్నారు భక్తులు. అమ్మవారి సంపద మాయంపై విచారణ జరపకపోతే మాత్రం పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. అదే ఆడిటింగ్. మరి భక్తులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఆడిటింగ్ నిర్వహిస్తారా? లేదా?. ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా? లేదా? దేవాదాయశాఖ ఏం చేయబోతోంది?. ఇంటి దొంగలెవరో బయటికి తీస్తుందా? లేదా?. భక్తులను కంటికి రెప్పలా కాపాడే అమ్మవారి ఆస్తులకే భద్రత లేకుండా పోయిందంటూ భక్తులు వాపోతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..