Chaturgrahi Yoga: 12 ఏళ్ల తర్వాత చతుర్గ్రాహి యోగం.. ఈ 4 రాశులు పట్టిందల్లా బంగారమే.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి..

మరికొద్ది రోజుల్లో నాలుగు గ్రహాలు ఒకే రాశిలో కలుసుకోనున్నాయి. దీనిని చతుర్గ్రాహి యోగం అని అంటారు. 12 సంవత్సరాల తర్వాత మేషరాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఏప్రిల్ 22న మేషరాశిలో సూర్యుడు, రాహువు, బుధుడు, బృహస్పతి సంచారించనున్నారు.

Chaturgrahi Yoga: 12 ఏళ్ల తర్వాత చతుర్గ్రాహి యోగం.. ఈ 4 రాశులు పట్టిందల్లా బంగారమే.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి..
Sun In Horoscope
Follow us
Surya Kala

|

Updated on: Apr 19, 2023 | 9:48 AM

కొంతమందికి జ్యోతిష్యంపై నమ్మకం ఉంటే , మరికొందరికి నమ్మకం ఉండదు. అయితే  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవ జీవితంపై గ్రహాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఒక నిర్దిష్ట పరిధిలో గ్రహాల సంచారం వల్ల శుభ యోగాలు, అశుభ యోగాలు కలుగుతాయి. మరికొద్ది రోజుల్లో నాలుగు గ్రహాలు ఒకే రాశిలో కలుసుకోనున్నాయి. దీనిని చతుర్గ్రాహి యోగం అని అంటారు. 12 సంవత్సరాల తర్వాత మేషరాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఏప్రిల్ 22న మేషరాశిలో సూర్యుడు, రాహువు, బుధుడు, బృహస్పతి సంచారించనున్నారు. ఈ నాలుగు రాశుల వారు ఈ సమయంలో అదృష్టవంతులు.. వీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ రోజు ఏఏ రాశులకు అదృష్టం వరిస్తుందో తెలుసుకుందాం..

మేష రాశి : ఈ నాలుగు రాశుల కలయిక వల్ల మేష రాశి వారికి శుభం కలుగుతుంది. ఈ యోగం ఏర్పడే సమయంలో, మేష రాశి వారు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఏ వ్యాపారం చేసినా.. లాభాలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఏది పట్టుకున్నా బంగారమే! వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. అవివాహితులకు వివాహ సంబంధాలు కూడా వస్తాయి.

మిథున రాశి : చతుర్గహి యోగ సమయంలో ఈ రాశి వారు చేపట్టిన అన్ని పనులు సక్సెస్ అవుతాయి. ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో విజయాలు, కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి: ఈ రాశి వారికి చతుర్గహి యోగం శుభ ప్రదం. లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి ఉద్యోగులకు ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు, విదేశాలకు వెళ్లే అవకాశాలు, వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది.

సింహ రాశి : ఈ రాశి వారికి చతుర్గహి యోగంతో మంచి రోజులు మొదలవుతాయి. విద్యార్థులు ఏ పరీక్షలోనైనా విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రాజకీయ, సామాజిక సేవారంగాలోని వారు మంచి పేరు తెచ్చుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?