చేపల కోసం వల వేస్తే విచిత్ర ఆకారం వచ్చింది.. భయంకరమైన ముఖంతో.. 12 అడుగుల పొడవుతో..

ఈ చేప సాధారణంగా అమెరికాలో కనిపిస్తుందని చెప్పారు. ఇది అన్ని రకాల చేపల నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ జాతి చేపల పొడవు 10 నుంచి 12 అడుగుల వరకు ఉంటుందన్నారు. ఈ వింత చేప ఫోటోలు, వీడియోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

చేపల కోసం వల వేస్తే విచిత్ర ఆకారం వచ్చింది.. భయంకరమైన ముఖంతో.. 12 అడుగుల పొడవుతో..
Fishermen
Follow us

|

Updated on: Apr 20, 2023 | 7:27 AM

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ పెద్ద చెరువులో ఓ వింత చేప దొరికింది. అది ఎలాఉందంటే..ఆ చేప చూసిన వారు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే..అది చూసేందుకు అచ్చం మొసలిలాగే కనిపిస్తుంది.. అది మొసలా..? లేదంటే చేప అనినిర్ణయించలేరు. భోపాల్‌లోనే కాదు దేశం మొత్తంలో ఎక్కడా కనిపించదు. ఈ చేప పేరు ఎలిగేటర్ గార్‌ అంటారు. ఇలాంటి చేపలు ఎక్కువగా అమెరికాలో దొరుకుతుంటాయి. భోపాల్‌లోని ఖనుగావ్‌కు చెందిన అనస్ అనే వ్యక్తి ఖానుగావ్ పక్కనే ఉన్న చెరువు ఒడ్డున చేపల వేటకు వెళ్లాడు. ఈ సమయంలో అతని వలలో ఒక చేపచిక్కింది. అది చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఈ రకమైన చేపలను అతను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. డిస్కవరీ ఛానల్ చూడటం అంటే తనకు చాలా ఇష్టమని అనస్ చెప్పాడు. అతను డిస్కవరీ ఛానెల్‌లో అలాంటి చేపలను చూశాడు.

ఇది అన్ని రకాల చేపల నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎలిగేటర్‌ గార్‌ నోరు మొసలిలా ఉంటుంది..ఇక మత్స్యకారుడి వలకు చిక్కిన ఈ వింత చేప ఫోటోలు, వీడియోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో విషయం మత్స్యశాఖ అధికారులకు చేరింది. చేపను పరిశీలించిన అధికారులు..అది సముద్రపు చేప అని స్పష్టం చేశారు.. ఎలిగేటర్ గార్ అని పిలువబడే ఈ చేప సాధారణంగా అమెరికాలో కనిపిస్తుందని చెప్పారు.ఈ జాతి చేపల పొడవు 12 అడుగుల వరకు ఉంటుందన్నారు. కానీ, భోపాల్‌లో దొరికే చేపల పొడవు ఒకటిన్నర అడుగులు మాత్రమే ఉంది. అంతేకాదు,ఈ అమెరికన్ చేప జాతుల సగటు జీవిత కాలం 20 సంవత్సరాలుగా వెల్లడించారు.

Fish With Alligator Mouth

Fish With Alligator Mouth

భోపాల్‌లోని ప్రముఖ ఫిషింగ్ నిపుణుడు షరీక్ అహ్మద్ ఈ చేప గురించి మాట్లాడుతూ.. కోల్‌కతా, ఆంధ్రప్రదేశ్ నుండి భోపాల్‌లో చేపల విత్తనాలు వస్తాయని చెప్పారు. బహుశా అదే విత్తనంతో ఎలిగేటర్ గార్ విత్తనం భోపాల్ చేరి ఉండవచ్చునని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..