Watch: నా దగ్గర పప్పులుడకవ్.. గుడ్ల కోసం వచ్చిన మహిళలకు చుక్కలు చూపించిన నెమలి

ఈ వీడియోను ట్విటర్‌లో ది ఫిగెన్ అనే ఖాతా ద్వారా షేర్‌ చేయగా వీడియో వైరల్‌గా మారింది. 6,74,000 మందికి పైగా ఈ వైరల్‌ వీడియోని వీక్షించారు. 6 వేల మందికి పైగా దీన్ని లైక్ చేయగా, 721 మంది ఈ వీడియోను రీట్వీట్ చేశారు.

Watch: నా దగ్గర పప్పులుడకవ్.. గుడ్ల కోసం వచ్చిన మహిళలకు చుక్కలు చూపించిన నెమలి
Peacock Viral Video
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 20, 2023 | 10:40 AM

నెమలి వైరల్ వీడియో: మనుషులైనా, జంతువులైనా, పక్షులైనా సరే.. వాటి బిడ్డల జోలికి వస్తే మాత్రం ఊరుకోవు. తమ పిల్లల ప్రాణాలను కాపాడుకోవటానికి ఎంతటి సాహసానికైన సిద్ధపడుతుంటాయి. ఇక పక్షులు కట్టుకున్న తమ గూడులోకి ఎవరైన వచ్చి గుడ్లు, పిల్లలకు హానీ తలపెట్టాలని చూస్తే మాత్రం ముక్కుతో పొడిచి, కాళ్లతో రక్కి బీభత్సం చేస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఓ వీడియో ఇందుకు అద్దం పట్టేలా ఉంది. ఎత్తైన చెట్టుపై గూడులోని నెమలి గుడ్లను దొంగిలించేందుకు ఇద్దరు మహిళలు ప్రయత్నించారు. సమయానికి అక్కడికి పరుగెత్తుకొచ్చిన నెమలి ఏం చేసిందో తెలుసా… వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు మహిళలు చెట్టు నుండి నెమలి గుడ్లను దొంగిలించడం చూడవచ్చు. వీరిలో ఒక మహిళ చెట్టు ఎక్కి గుడ్లను దొంగిలించి కిందకు వేస్తుండగా, మరో మహిళ కింద నిలబడి నెమలి గుడ్లను పట్టుకుంది. ఇదంతా ఎక్కడ్నుంచి గమనించిందో తెలియదు గానీ, గాల్లో ఎగురుకుంటూ వచ్చిన నెమలి గుడ్లను కాపాడుకునేందుకు వెంటనే చెట్టుపైకి దూకింది. గుడ్లను దొంగిలిస్తున్న మహిళలపై దాడి చేసింది. నెమలి మొదట చెట్టుపై ఉన్న మహిళపై దాడి చేసి గుడ్లను తీయకుండా ఆమెను అడ్డుకుంది. ఆ తర్వాత కింద గుడ్లు పట్టుకుంటున్న మహిళపై కూడా దూకి దాడిచేసింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ట్విటర్‌లో ది ఫిగెన్ అనే ఖాతా ద్వారా షేర్‌ చేయగా వీడియో వైరల్‌గా మారింది. 6,74,000 మందికి పైగా ఈ వైరల్‌ వీడియోని వీక్షించారు. 6 వేల మందికి పైగా దీన్ని లైక్ చేయగా, 721 మంది ఈ వీడియోను రీట్వీట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..