అన్నా అని పిలిచిన వ్యక్తినే పెళ్లి చేసుకున్న యువతి !! ఆమెపై నెటిజన్లు ఫైర్
ఎనిమిదేళ్ల పాటు అన్నా అని పిలిచిన వ్యక్తినే చివరకు పెళ్లాడానంటూ ఓ యువతి నెట్టింట పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. విని అనే యువతి ఇన్‌స్టాలో ఈ విషయాలను పంచుకుంది. తన భర్త పేరు జయ్ అని చెప్పింది. తమ మధ్య దూరపు చుట్టరికం ఉందని..
ఎనిమిదేళ్ల పాటు అన్నా అని పిలిచిన వ్యక్తినే చివరకు పెళ్లాడానంటూ ఓ యువతి నెట్టింట పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. విని అనే యువతి ఇన్‌స్టాలో ఈ విషయాలను పంచుకుంది. తన భర్త పేరు జయ్ అని చెప్పింది. తమ మధ్య దూరపు చుట్టరికం ఉందని, అయితే జెయ్ తన కంటే పెద్దవాడు కావడంతో అతడు ఎప్పుడు కనిపించినా అన్నా అని పిలుస్తుండేదాన్నని చెప్పుకొచ్చింది. తమకు ఓ బిడ్డ కూడా ఉన్నాడని చెప్పుకొచ్చింది. అన్నయ్యే ప్రియుడు అయ్యాడనే అర్థం వచ్చేలా ‘భయ్యా సే సయ్యా’ అంటూ తమ ఫొటోలకు ఓ క్యాప్షన్ కూడా జత చేసింది. అయితే, యువతి తీరు పట్ల నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. వయసులో పెద్దవాళ్లను అన్నా అని పిలిచినంత మాత్రాన వాళ్లు మనకు వరుసకు అన్నదమ్ములు కారని ఆమెను సమర్థిస్తూనే ఆమె పెట్టిన క్యాప్షన్ పట్ల విముఖత వ్యక్తం చేశారు. మరీ అన్నయ్యే ప్రియుడు అయ్యాడు అనే అర్థం వచ్చే క్యాప్షన్ పెట్టడం ఏమాత్రం సబబుగా లేదని కుండబద్దలు కొట్టారు. యువతి పెట్టిన క్యాప్షన్ ఎబ్బెట్టుగా ఉందని అధికశాతం మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంతవరకు ఎవ్వరు చేయని సాహసం.. 500 రోజులు గుహలో ఒంటరిగా ??
గెలిచిన వ్యక్తికి ఏడాదంతా పెయిడ్ లీవ్
కబ్‌బోర్డ్‌నుంచి వింత శబ్దాలు.. ఓపెన్ చేసి చూడగా కనిపించిన ??
కబడ్డీ డ్యాన్స్.. చూస్తే పొట్టచెక్కలే.. నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
Agent: యూట్యూబ్ కొల్లగొడుతున్న ఏజెంట్..