ఓరీ దేవుడో..! ఆమె ధైర్యానికి మొక్కాలి..! 500 రోజులు గుహలోనే ఒంటరిగా గడిపింది!
ఫోన్‌లేదు, బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు. పిలిస్తే పలికే నాధులే లేరు..ఎటు చూసినా చిమ్మ చీకటి..పైగా చుట్టూ ఏముందో కూడా తెలియని నిర్మానుష్యం.. ఒంటరిగా ఓ చీకటి గుహలో ఉంటే ఎలా ఉంటుంది..? ఆ ఊహే ఎంత భయంకరంగా ఉందో కదా..! అలాంటి సాహసమే చేసింది స్పెయిన్‌కు చెందిన బియాట్రిజ్ ఫ్లమిని. వృత్తిరీత్యా క్రీడాకారిణి, పర్వతారోహకురాలైన ఆమె.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 500 రోజులు చిమ్మ చీకట్లు కమ్ముకున్న గుహలో కాలం గడిపింది. అక్కడే రెండు పుట్టినరోజులు జరుపుకున్న ఆమె.. తాజాగా గుహ నుంచి బయటికొచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
