- Telugu News Photo Gallery Chapati for Weight Loss: Many health benefits of eating chapati at least once a day
Weight Loss Tips: అందుకే రోజులో ఒక్కసారైనా చపాతీ తినాలి..
రాత్రి భోజనంలో చపాతీని భాగం చేసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రి పూట మాత్రమేకాదు రోజులో ఎప్పుడైనా కనీసం ఒకసారైనా చపాతీ తిన్నా కూడా సమాన ఫలితం ఉంటుందని చెబుతున్నారు
Updated on: Apr 20, 2023 | 9:19 AM

రాత్రి భోజనంలో చపాతీని భాగం చేసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రి పూట మాత్రమేకాదు రోజులో ఎప్పుడైనా కనీసం ఒకసారైనా చపాతీ తిన్నా కూడా సమాన ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

చపాతీలో ‘బి’, ‘ఇ’ విటమిన్లతో పాటు కాపర్, జింక్, అయొడిన్, మాంగనీస్, సిలికాన్, పొటాషియం, క్యాల్షియం.. వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే చపాతీలో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. తద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండచ్చు.

రోజూ రెండు సాధారణ సైజు చపాతీలను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే అధిక పీచు ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. తద్వారా ఎక్కువ సమయం ఆకలేయకుండా చేస్తుంది. ఇతర ఆహారాలతో పోల్చితే ఇందులో క్యాలరీలూ తక్కువే. అందుకే సులువుగా బరువు తగ్గాలనుకునే వారి మొదటి ఎంపిక చపాతి అవుతుంది.


చపాతీల్లో ఉండే జింక్, ఇతర ఖనిజాలు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో తోడ్పడుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తద్వారా చర్మ సమస్యలు దరిచేరకుండా నవయవ్వనంగా మెరిసిపోవచ్చు.




