AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో అందుబాటులోకి డబుల్ డెక్కర్ బస్సులు.. రూట్లు కూడా ఎంపిక చేశారు

హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. పలు పర్యాట ప్రాంతాలు తిరిగివచ్చేలా ప్రత్యేక రూట్లను జీహెచ్ఎంసీ సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ బుధవారం ట్వట్టర్ వేదికగా వెల్లడించారు.

Hyderabad: హైదరాబాద్‌లో అందుబాటులోకి డబుల్ డెక్కర్ బస్సులు.. రూట్లు కూడా ఎంపిక చేశారు
Double Decker Bus
Aravind B
|

Updated on: Apr 20, 2023 | 12:05 PM

Share

హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. పలు పర్యాట ప్రాంతాలు తిరిగివచ్చేలా ప్రత్యేక రూట్లను జీహెచ్ఎంసీ సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ బుధవారం ట్వట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే గతంలోనే రూ.12.96 కోట్లతో ఆరు డబుల్ డెక్కర్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను హెచ్ఎండీఏ కొనుగోలు చేసింది.అయితే ఎట్టకేలకు ఈ బస్సులు తిరిగేలా కొన్ని రూట్లను ఎంపిక చేశారు. ముఖ్యంగా ట్యాంక్‌బండ్‌, బిర్లామందిర్‌, అసెంబ్లీ, సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, మక్కా మసీద్‌తోపాటు తారామతి బారాదరి, గోల్కొండ, గండిపేట పార్కు, దుర్గం చెరువు, తీగల వంతెన, ఐటీ కారిడార్‌, ఫైనాన్షియల్‌ జిల్లా ప్రాంతాల్లో నడపనున్నారు.

ఉదయం ట్యాంక్ బండ్ వద్ద బయలు దేరి ఆయా రూట్లల్లో తిరుగుతూ మళ్లీ తిరిగి ట్యాంక్ బండ్ కు చేరుకుంటాయి. అయితే ఛార్జింగ్ కోసం ఖైరతాబాద్ ఎస్టీపీ, సంజీవయ్య పార్కులో ప్రత్యేక పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు. కొన్నిరోజుల పాటు ఈ బస్సులో ఉచిత ప్రయాణమే ఉండనుంది. ఆ తర్వాత కనీస ఛార్జి విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒక్కో ట్రిప్పుకు ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.50 చొప్పున వసూలు చేసే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి టిక్కెట్ అందుబాటులోకి తీసుకురావాలని అన్న విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే పర్యాటకులు స్పందనను బట్టి మరికొన్ని రూట్లను కూడా ఎంపిక చేయనున్నారు. అయితే గతంలోనే మంత్రి కేటీఆర్.. అదనంగా మరో 30 వరకు ఏసీ డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..