AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కారులో దూరిన భారీ కొండచిలువ.. ఆ వ్యక్తి చేసిన పని చూస్తే షాక్ అవుతారు..!

దారి వెంట చిన్న పాము పోతేనే హడలిపోతాం. అలాంటిది మనం ప్రయాణించే వాహనంలో పాము దూరితే? అది కూడా భారీ కొండచిలువ దూరితే? ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైకే పోతాయి. అలాంటి పరిస్థితే ఓ రైతుకు ఎదురైంది. అయితే, నిత్యం అడవీ జీవులతో సహజీవనం సాగించే రైతుకు ఆ పాము పెద్ద ప్రమాదంగా కనిపించలేదు.

Viral Video: కారులో దూరిన భారీ కొండచిలువ.. ఆ వ్యక్తి చేసిన పని చూస్తే షాక్ అవుతారు..!
Snake
Shiva Prajapati
|

Updated on: Apr 20, 2023 | 6:17 AM

Share

దారి వెంట చిన్న పాము పోతేనే హడలిపోతాం. అలాంటిది మనం ప్రయాణించే వాహనంలో పాము దూరితే? అది కూడా భారీ కొండచిలువ దూరితే? ఇంకేమైనా ఉందా.. పై ప్రాణాలు పైకే పోతాయి. అలాంటి పరిస్థితే ఓ రైతుకు ఎదురైంది. అయితే, నిత్యం అడవీ జీవులతో సహజీవనం సాగించే రైతుకు ఆ పాము పెద్ద ప్రమాదంగా కనిపించలేదు. పైగా దానితో చెలిమి చేశాడు. దానిని సరదాగా కారులో తీసుకెళ్లి అడవీ ప్రాంతంలో వదిలేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన రైతు కారులో ప్రయాణిస్తుండగా ఒక కొండ చిలువ దూరింది. ఆ పామును చూసి అతను భయపడలేదు. పైగా దానితో ముచ్చటించాడు కూడా. ‘కొంచెం నిదానంగా ఉండు. ఎలాంటి పిచ్చి పనులు చేయకు’ అంటూ పాముకు సూచించాడు. అలా తన పాటికి తాను డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు. మరోవైపు పాము నెమ్మదిగా డ్యా్ష్‌బోర్డ్ పైకి వచ్చింది. అటూ ఇటూ తిరిగింది. కాసేపటి తరువాత రైతు తన కారును నిర్మానుష్య ప్రాంతంలో నిలిపాడు. ఆ పామును అటవీ ప్రాంతంలో వదిలాడు. దాంతో ఆ పాము సైలెంట్‌గా తన దారిన తాను వెళ్లిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. మరెందుకు ఆలస్యం.. ఈ స్టన్నింగ్ వీడియోను మీరూ చూసేయండి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్