Gymnastic Stunt: విషాదం నింపిన విన్యాసం.. గాల్లో నుంచి కిందపడిపోయిన మహిళ..తర్వాత ఏం జరిగిందంటే
చైనాలోని ఓ జిమ్నాస్టిక్ పదర్షనలో విషాదం చోటుచేసుకుంది. ఓ జంట గాల్లో విన్యాసాలు చేస్తుండగా మహిళ కిందపడిపోవడంతో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. వివరాల్లకి వెళ్తే చైనా సెంట్రల్ అన్‌హువై ప్రావిన్సులోని సుజోవు నగరానికి సమీపంలో ఓ జిమ్నాస్టిక్ ప్రదర్శన ఏర్పాటు చేశారు.
చైనాలోని ఓ జిమ్నాస్టిక్ పదర్షనలో విషాదం చోటుచేసుకుంది. ఓ జంట గాల్లో విన్యాసాలు చేస్తుండగా మహిళ కిందపడిపోవడంతో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. వివరాల్లకి వెళ్తే చైనా సెంట్రల్ అన్‌హువై ప్రావిన్సులోని సుజోవు నగరానికి సమీపంలో ఓ జిమ్నాస్టిక్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో సన్ అనే మహిళ తన భర్తతో కలిసి విన్యాసాలు చేశారు. ప్రదర్శనలో భాగంగా క్రేన్ సహాయంతో భార్యభర్తలిద్దర్ని పైకి లేపారు. అయితే ఈ ప్రదర్శన జరుగుతున్నప్పుడు క్రేన్ కు ఉన్న బెల్డును భర్త పట్టుకోగా.. అతని చేతులు పట్టుకోని ఆమె గాల్లో విన్యాసాలు చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో భర్త కాళ్లను పట్టుకోని ఫీట్ మార్చడంలో ఆమె విఫలమైంది. దీంతో పట్టుకోల్పోయి సన్ ఒక్కసారిగా కిందపడిపోయింది .
దాదాపు 30 ఫీట్ల ఎత్తు నుంచి ఆమె పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో ప్రదర్శన చూస్తున్నవారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో గాయాలపాలైన ఆ మహిళను నిర్వాహకులు వెంటనే ఆస్పత్రికి తరలించారు . అయినప్పటికి ప్రయత్నాలు ఫలించకోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రదర్శన సమయంలో భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగిందని.. తన భర్త సేఫ్టీ బెల్టులు ధరించమని ఆమెకి చెప్పినప్పటికీ.. తను తిరస్కరించినట్లు ఓ వార్త కథంలో ప్రచూరించారు. అయితే సన్ భర్త మాత్రం మా ఇద్దరి ఎటువంటి గొడవ కాలేదని.. తాము ఎప్పుడు సంతోషంగా ఉండేవాళ్లమని తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..