AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కడుపులో క్లాత్ పెట్టి మరిచిన ఘటనపై హైకోర్ట్‌ సీరియస్‌.. సుమోటాగా కేసు స్వీకరణ.

జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలోఆపరేషన్ చేసి కడుపులో గుడ్డ వదిలేసిన ఘటనను తెలంగాణ హైకోర్ట్‌ సుమోటాగా స్వీకరించింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఆపరేషన్‌ జరిగిన 16 నెలల తర్వాత కడుపులో గుడ్డ ఉన్నట్లు తాజాగా వెలుగులోకి రావడం అందరినీ విస్మయానికి...

Telangana: కడుపులో క్లాత్ పెట్టి మరిచిన ఘటనపై హైకోర్ట్‌ సీరియస్‌.. సుమోటాగా కేసు స్వీకరణ.
Ts Highcourt
Narender Vaitla
|

Updated on: Apr 20, 2023 | 3:52 PM

Share

జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలోఆపరేషన్ చేసి కడుపులో గుడ్డ వదిలేసిన ఘటనను తెలంగాణ హైకోర్ట్‌ సుమోటాగా స్వీకరించింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఆపరేషన్‌ జరిగిన 16 నెలల తర్వాత కడుపులో గుడ్డ ఉన్నట్లు తాజాగా వెలుగులోకి రావడం అందరినీ విస్మయానికి గురి చేసింది. వైద్యుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ.. టీవీ9 తెలుగు వరుస కథనాలు ప్రసారం చేసిన విషయ తెలసిందే. దీంతో ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్ట్‌ సీరియస్‌గా తీసుకుంది. ఇందులో భాగంగానే సుమోటాగా కేసును స్వీకరించింది.

ఇదిలా ఉంటే జగిత్యాల జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఓ మ‌హిళ‌కు ఆపరేషన్ చేసిన సమయంలో కడుపులో కాటన్ క్లాత్ వదిలి కుట్లు వేసిన ఘటనపై త్రీ మెన్ కమిటీ విచారణ చేప‌ట్టింది. విచారణలో భాగంగా వేములవాడలో బాధితురాలు నవ్యశ్రీ కడుపులో నుండి కాటన్ క్లాత్ బయటకు తీసిన వైద్యురాలిని క‌మిటీ స‌భ్యులు విచారించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మాత శిశు సంక్షేమ ఆసుపత్రిలో రికార్డుల పరిశీలన, ఆపరేషన్ చేసింది ఎవరనే దాని పై కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిగింది.

ఆపరేషన్‌ జరిగిన 16 నెలల తర్వాత నవ్యశ్రీ కడుపు నొప్పితో బాధపడడంతో కుటుంబ సభ్యులు ఆమెను వేములవాడ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు స్కానింగ్ చేయడంతో కడుపులో కాటన్ క్లాత్ ఉన్న విషయం బయటపడింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యంపై నవ్యశ్రీ తల్లిదండ్రులు జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాషకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన కలెక్టర్ సర్జరీ చేసిన డాక్టర్లు, అసిస్టెంట్లు ఆనాటి రికార్డుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా త్రీ మెన్ కమిటీ సభ్యులు విచారణ జరిపారు.

తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీ కారు ఎంత వేగంతో నడిపితే బెస్ట్ మైలేజీ వస్తుంది? కీలక విషయాలు
మీ కారు ఎంత వేగంతో నడిపితే బెస్ట్ మైలేజీ వస్తుంది? కీలక విషయాలు
ఈ ఒక్క ఆకు బట్టతల మీద కూడా జుట్టు పెరిగేలా చేసే అద్భుత ఔషధం!
ఈ ఒక్క ఆకు బట్టతల మీద కూడా జుట్టు పెరిగేలా చేసే అద్భుత ఔషధం!
ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..
ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ