ESIC Hyderabad Jobs 2023: హైదరాబాద్‌లో ఈఎస్‌ఐసీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. ఎంపికైతే నెలకు రూ.2 లక్షలకుపైగా జీతం
భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.. 40 సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ కన్సల్టెంట్, సీనియర్ రెసిడెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.. 40 సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ కన్సల్టెంట్, సీనియర్ రెసిడెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేడియాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ తదితర తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రర్ అయ్యి ఉండాలి. అభ్యర్ధుల వయసు 45 నుంచి 69 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలు కలిగిన అభ్యర్ధులు 2023, ఏప్రిల్ 25, 26, 27, 28 తేదీల్లో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.67,700ల నుంచి రూ.2.4 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్:
Chamber of Medical Superintendent, ESIC Super Speciality Hospital, Sanathnagar, Hyderabad.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.