Doordarshan Recruitment: దూరదర్శన్‌లో 41 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హతలేంటో? తెలుసా.?
ఏకంగా 41 పోస్టులను ఢిల్లీ కేంద్రంగా భర్తీ చేయడానికి సిద్ధమైంది. వీడియోగ్రాఫర్ పోస్ట్ కోసం అనుభవజ్ఞులైన, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు దూరదర్శన్ రిక్రూట్‌మెంట్ 2023 అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రసారభారతికి చెందిన దూరదర్శన్ న్యూస్ ఫుల్ టైం కాంట్రాక్ట్ బేసిస్ కింద వీడియోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏకంగా 41 పోస్టులను ఢిల్లీ కేంద్రంగా భర్తీ చేయడానికి సిద్ధమైంది. వీడియోగ్రాఫర్ పోస్ట్ కోసం అనుభవజ్ఞులైన, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు దూరదర్శన్ రిక్రూట్‌మెంట్ 2023 అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
వయోపరిమితి
దూరదర్శన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023 ప్రకారం భర్తీ చేయనున్న 41 వీడియోగ్రాఫర్ల పోస్టులకు అప్లయ్ చేయాలంటే వారికి 18-04-2023 నాటికి 40 సంవత్సరాల లోపు ఉండాలి.
అర్హత, అనుభవం
- అభ్యర్థులు 10+2 అర్హత సాధించి ఉండాలి
- అలాగే గుర్తింపు పొందిన యూనివర్శిటీ/సంస్థ నుంచి సినిమాటోగ్రఫీ/వీడియోగ్రఫీలో డిగ్రీ/డిప్లొమా అర్హత ఉండాలి.
- వీడియోగ్రఫీ/సినిమాటోగ్రఫీ లేదా ఏదైనా ఇతర సంబంధిత రంగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
డిసైరబుల్ క్వాలిఫికేషన్లు
మోజోలో అనుభవం. అలాగే షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కోర్సులో చేసిన వారు
నెలవారి జీతం
అధికారిక నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఎంపికైన అభ్యర్థులు రూ.40000 నెలవారీ వేతనం పొందుతారు.
ఎంపిక ప్రక్రియ ఇలా
దూరదర్శన్ 2023 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూ లేదా టెస్ట్ కోసం పిలుస్తారు. పరీక్ష/ఇంటర్వ్యూకు హాజరైనందుకు టీఏ/డీఏలు చెల్లించరు.
దరఖాస్తు ఇలా
దూరదర్శన్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీలోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు సమర్పణలో ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని స్క్రీన్‌షాట్ తీసి మెయిల్ కు పంపితే వారు పరిష్కార మార్గం చూపుతారు. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి ఇంకా పన్నెండు రోజుల గడువు ఉంది. ముగింపు తేదీ తర్వాత స్వీకరించిన దరఖాస్తులు అంగీకరించరని గమనించాలి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.