NFDC Recruitment 2023: నెలకు రూ.85,000ల జీతంతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఏయే అర్హతలుండాలంటే..
ముంబయిలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎఫ్‌డీసీ).. 35 గార్డెనింగ్ సూపర్‌వైజర్, సీనియర్ కో ఆర్డినేటర్, అసిస్టెంట్ మేనేజర్, గ్రాఫిక్ డిజైనర్, ఆఫీస్ అసిస్టెంట్, కంటెంట్ రైటర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..
ముంబయిలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎఫ్‌డీసీ).. 35 గార్డెనింగ్ సూపర్‌వైజర్, సీనియర్ కో ఆర్డినేటర్, అసిస్టెంట్ మేనేజర్, గ్రాఫిక్ డిజైనర్, ఆఫీస్ అసిస్టెంట్, కంటెంట్ రైటర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టును బట్టి ఎస్‌ఎస్‌సీ/ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ డీఓపీ/ పోస్టు గ్రాడ్యుయేషన్/ బీకాం/ బీఎస్సీ/ ఎంఎస్సీ/ ఎంఏ/ ఎంబీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఏడాది నుంచి ఐదేళ్ల అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్ విధానంలో మే 1, 2023వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించాలి. విద్యార్హతలు, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను సెలెక్ట్ చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.85,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్:
National Film Development Corporation Ltd., 5th Floor, NMIC Building, NFDC – FD Complex, 24, Pedder Road, Cumballa Hill, Mumbai – 400 026.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.