AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: మామూలు స్కెచ్ కాదుగా.. ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరికి పాల్పడింది వీళ్లే..

పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలా దేవి పొన్నూరు సమీపంలోని చింతలపూడిలో ఒంటరిగా నివసిస్తోంది. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరులో ఉంటారు. ఈ నెల పదిహేనో తేదిన మహా శివరాత్రి కావడంతో ఆమె గుంటూరులోని కొడుకు ఇంటికి వెళ్ళింది. ఆమె గుంటూరు వెళ్ళిన విషయాన్ని సత్తెనపల్లి రాకేష్ తెలుసుకున్నాడు.

Andhra: మామూలు స్కెచ్ కాదుగా.. ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరికి పాల్పడింది వీళ్లే..
Ponnur Mla Dhulipalla Mother's House Theft Case
T Nagaraju
| Edited By: |

Updated on: Feb 25, 2026 | 5:49 PM

Share

పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలా దేవి పొన్నూరు సమీపంలోని చింతలపూడిలో ఒంటరిగా నివసిస్తోంది. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరులో ఉంటారు. ఈ నెల పదిహేనో తేదిన మహా శివరాత్రి కావడంతో ఆమె గుంటూరులోని కొడుకు ఇంటికి వెళ్ళింది. ఆమె గుంటూరు వెళ్ళిన విషయాన్ని సత్తెనపల్లి రాకేష్ తెలుసుకున్నాడు. తన స్నేహితులతో కలిసి రెక్కీ నిర్వహించాడు. అంతా అనుకూలంగా ఉందని భావించిన తర్వాత చోరి చేశారు. భారీగా బంగారు, వెండి ఆభరణాలు, నగదు తీసుకెళ్ళాడు. ఎమ్మెల్యే తల్లి ఇంట్లోనే చోరి జరగడం కలకలం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సిసి కెమెరాల సాయంతో చోరికి పాల్పడిన వారిని గుర్తించారు. మొత్తం ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఏలూరు జిల్లాకు చెందిన రాకేష్ గత కొంత కాలంగా దొంగతనాలు చేస్తున్నాడు. ఇప్పటికే అతనిపై 34 కేసులు నమోదు అయ్యాయి. సొంత జిల్లాలో పోలిసుల నిఘా పెరగడంతో ఇతర జిల్లాలపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో చీరాలోని తన స్నేహితుల వద్దకు చేరుకున్నాడు. ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరికి పక్కాగా ప్లాన్ వేసుకున్నాడు. స్నేహితులతో కలిసి చీరాల బీచ్ లో కారు దొంగిలించారు. ముగ్గురు కలిసి చింతలపూడి చేరుకున్నారు. ప్రమీలా దేవి ఇంట్లో చోరి చేసి ఏలూరు వెళ్ళిపోయారు.

తాము చోరి చేసిన ఆభరణాలను చాట్రగడ్డ సర్పంచ్ రఘుకు ఇచ్చి విక్రయించారు. దీంతో వెండిని కరిగించిన రఘు దిమ్మెలా అచ్చుపోయించాడు. కొన్ని బంగారు ఆభరణాలను రాకేష్ తల్లికి ఇచ్చి భద్ర పరచమని చెప్పాడు. రఘుకి ఆభరణాలు ఇస్తున్న సమయంలో ఫోటో తీసుకున్నాడు. సిసి కెమెరాల సాయంతో ఆధారాలు సేకరించిన పోలీసులు మొదట రాకేష్ ను అదుపులోకి తీసుకున్నారు.

వీడియో చూడండి..

ఆ తర్వాత రాకేష్ ఫోన్ ఆధారంగా రఘుని, రాకేష్ స్నేహితులను గుర్తించి అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 70 లక్షల విలువ చేసే 42 సవర్ల బంగారు. 10.5 కేజీల వెండి, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటితో ఐదు దశాబ్దాల క్రితం వెండితో తయారు చే‌సిన సరస్వతి విగ్రహాన్ని కరిగించకుండా ఉంచడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..