AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ వైపు తల్లి మరణం.. మరోవైపు పరీక్ష.. పుట్టెడు దుఃఖంలోనే హాజరైన విద్యార్థి

అప్పుల బాధతో తల్లి మరణించగా, అదే రోజు ఇంటర్ పరీక్షలకు హాజరైన కూతురి విషాద గాథ ఇది. మల్యాల మండలంలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటన అందరి మనసులను కలిచివేసింది. తల్లి శవం ఇంట్లో ఉండగానే, తన భవిష్యత్తు కోసం మనోధైర్యంతో పరీక్ష రాసిన ఆ కూతురి ధైర్యం, బాధ వర్ణనాతీతం.

ఓ వైపు తల్లి మరణం.. మరోవైపు పరీక్ష..  పుట్టెడు దుఃఖంలోనే హాజరైన విద్యార్థి
Malyala Tragedy
G Sampath Kumar
| Edited By: |

Updated on: Feb 25, 2026 | 4:04 PM

Share

నవ మాసాలు మోసి పెంచిన కన్న తల్లి శవం ఒక వైపు..భవిష్యత్తుకు బాటలు వేసే ఇంటర్ పరీక్షలు మరొక వైపు..తల్లి లేదన్న బాధను దిగమింగుకుని పరీక్షలకు హాజరైన కూతురుని చూసి అందరి మనసులను కలిచివేసింది. ఈ విషాద సంఘటన మల్యాల మండలంలో చోటు చేసుకుంది. నూకపల్లి అర్బన్ కాలనీలో నివాసం ఉండే కనగాల అనూష అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడింది. ఫిబ్రవరి 24 మంగళవారం రోజున కెనాల్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది..అయితే అనూష పెద్ద కూతురు రమ్య శ్రీ కి ఈ రోజు నుండి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి.

కన్న తల్లి శవాన్ని చూసి రోదిస్తూనే తన భవిష్యత్తుకు బాటలు వేసే పరీక్షలకు బయల్దేరింది. తల్లి మరణ బాధను దిగమింగుకుని మనో ధైర్యంతో ఎగ్జామ్‌ సెంటర్‌కు వెళ్లింది. పరీక్ష రాసింది. ఈ ఘటన అక్కడ ఉన్నవారి అందరి హృదయాలను కలిచివేసింది. ఇంటి వద్ద తల్లిమృతదేహం ఉండగానే, అమ్మ చనిపోయిన బాధను దిగమింగుతూ ఎలాగోలా పరీక్ష రాసింది. పరీక్ష రాసి వచ్చిన కూతురిని ఓదార్చటం బంధువుల వల్ల కాలేదు. ఆ తర్వాత తల్లి అంతక్రియలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
జూబ్లీహిల్స్‌లో ఫెరారీ బీభత్సం.. తుక్కుతుక్కైన మూడు కార్లు
జూబ్లీహిల్స్‌లో ఫెరారీ బీభత్సం.. తుక్కుతుక్కైన మూడు కార్లు
టమాటా ఎండు రొయ్యలు ఇలా వండితే.. ఒక్క ముద్ద కూడా వదలరు
టమాటా ఎండు రొయ్యలు ఇలా వండితే.. ఒక్క ముద్ద కూడా వదలరు
నాటి YCP ప్రభుత్వం ఏం చేసిందో క్లారిటీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
నాటి YCP ప్రభుత్వం ఏం చేసిందో క్లారిటీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
హెరిటేజ్ పై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం ఫైర్
హెరిటేజ్ పై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు.. సీఎం ఫైర్
ఓ వైపు తల్లి మరణం.. మరోవైపు పరీక్ష..పుట్టెడు దుఃఖంలోనే హాజరైన వ
ఓ వైపు తల్లి మరణం.. మరోవైపు పరీక్ష..పుట్టెడు దుఃఖంలోనే హాజరైన వ
పింఛన్ల తొలగింపుపై ఏపీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. ఇకపై వారికే..
పింఛన్ల తొలగింపుపై ఏపీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. ఇకపై వారికే..
టమాటాలు ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. సంచులతో ఎగబడ్డ జనం.. పాపం రైతన్నలు
టమాటాలు ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. సంచులతో ఎగబడ్డ జనం.. పాపం రైతన్నలు
మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ..
మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ..
3 మార్పులతో బరిలోకి భారత జట్టు.. గంభీర్, సూర్య స్కెచ్ అదుర్స్
3 మార్పులతో బరిలోకి భారత జట్టు.. గంభీర్, సూర్య స్కెచ్ అదుర్స్
అదిరిపోయే డ్రెస్‌లో ఆలియా.. అందమే అసూయ పడుతుందేమో..
అదిరిపోయే డ్రెస్‌లో ఆలియా.. అందమే అసూయ పడుతుందేమో..