Jr.NTR-Allu Arjun: పుష్పరాజ్‏తో యంగ్ టైగర్.. ‘పుష్ప 2’ సెట్‎లో సందడి చేసిన ఎన్టీఆర్..

ఇక ఇటీవలే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా తారక్ విష్ చేయడం.. వీరిద్దరి మధ్య బావ అంటూ సోషల్ మీడియాలో కాసేపు చర్చ నడిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ట్వీట్స్ చూసి ఇటూ బన్నీ.. తారక్ అభిమానులను అలరించింది. ఇక తాజాగా పుష్ప 2 సెట్ లో ఎన్టీఆర్ సందడి చేసినట్లు సమాచారం.

Jr.NTR-Allu Arjun: పుష్పరాజ్‏తో యంగ్ టైగర్.. 'పుష్ప 2' సెట్‎లో సందడి చేసిన ఎన్టీఆర్..
Ntr, Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 27, 2023 | 3:27 PM

టాలీవుడ్ స్టార్ హీరోస్ మధ్య ఉండే రిలేషన్ గురించి చెప్పక్కర్లేదు. సినిమాల మధ్య పోటీ ఎలా ఉన్నా.. వీరంతా ప్రాణా స్నేహితులుగా కలిసిపోయి ఉంటారు. ఇటీవల మన తారల మధ్య ఉండే స్నేహం అనేకసార్లు ప్రూవ్ అవుతూనే ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో తారక్, చరణ్ మధ్య ఎలాంటి రిలేషన్ ఉందనేది తెలిసిపోయింది. ఇక అన్‏స్టాపబుల్ వేదికగా ప్రభాస్, చెర్రీ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అనేది అర్థమయ్యింది. ఇక ఇటీవలే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా తారక్ విష్ చేయడం.. వీరిద్దరి మధ్య బావ అంటూ సోషల్ మీడియాలో కాసేపు చర్చ నడిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ట్వీట్స్ చూసి ఇటూ బన్నీ.. తారక్ అభిమానులను అలరించింది. ఇక తాజాగా పుష్ప 2 సెట్ లో ఎన్టీఆర్ సందడి చేసినట్లు సమాచారం.

అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న పుష్ప 2 షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. అక్కడే తారక్.. మాస్ డైరెక్టర్ కొరటాల కాంబోలో కాబోతున్న తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ క్రమంలోనే షాట్ గ్యాప్ లో తారక్ పుష్ప 2 సెట్ కి వెళ్లిపోయారట. అక్కడ కాసేపు బన్నీ…సుక్కుతో కలిసి ముచ్చటించాడట. వీరిద్దరి షూటింగ్స్ పక్క పక్కనే జరగడం.. తారక్ వచ్చి పుష్ప సినిమా విషయాలను తెలుసుకోవడం చిత్రయూనిట్ కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఇక మరోవైపు ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ క్రేజ్ అందుకున్నారు ఎన్టీఆర్. ఇందులో తారక్ నటనకు హాలీవుడ్ మేకర్స్ సైతం ఫిదా అయ్యారు. ప్రస్తుతం తారక్ కొరటాల శివ రూపొందిస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!