AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agent Movie: ‘ఏజెంట్’ సినిమాతో ‘ధృవ’ చిత్రానికి ఉన్న లింకేంటీ ?.. అఖిల్, రామ్ చరణ్ కలిసి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారా ?..

ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన వీడియోస్.. సాంగ్స్ అంచనాలను పెంచేశాయి. కొన్ని రోజులుగా ప్రమోషన్స్ వేగంగా జరుపుకుంటున్న ఈమూవీ ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు అభిమానులకు సర్ ప్రైజ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

Agent Movie: 'ఏజెంట్' సినిమాతో 'ధృవ' చిత్రానికి ఉన్న లింకేంటీ ?.. అఖిల్, రామ్ చరణ్ కలిసి సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారా ?..
Akhil, Ram Charan
Rajitha Chanti
|

Updated on: Apr 27, 2023 | 3:07 PM

Share

అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ఏజెంట్. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీలో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీతో ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. అయితే ఇప్పటివరకు లవర్ బాయ్‏గా అమ్మాయిల మనసు దొచుకున్న అక్కినేని వారబ్బాయి.. ఇప్పుడు మాస్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్ పూర్తిగా మార్చేశాడు. సిక్స్ ప్యాక్ బాడీతో.. ఉంగరాల జుట్టుతో సరికొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన వీడియోస్.. సాంగ్స్ అంచనాలను పెంచేశాయి. కొన్ని రోజులుగా ప్రమోషన్స్ వేగంగా జరుపుకుంటున్న ఈమూవీ ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు అభిమానులకు సర్ ప్రైజ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రానికి..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రానికి కనెక్షన్ ఉన్నట్లు ఓ ఆసక్తికర వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. తాజాగా విడుదలైన వీడియోలో చరణ్ అఖిల్‏కు కాల్ చేయగా.. దృవ అంటూ కాలర్ నేమ్ వస్తుంది. ఏజెంట్ ఇక్కడ అందరూ నీ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారని చరణ్ అనగా.. నీ కమాండ్ కోసమే ఎదురుచూస్తున్నాను సీనియర్ అంటూ అఖిల్ చెప్పడం కనిపిస్తోంది. ఇక ఈ వీడియో చూస్తే ఏజెంట్ సినిమాతో అటు అక్కినేని అభిమానులకు.. ఇటు మెగా అభిమానులకు సర్ ప్రైజ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ మూవీలో చరణ్ అతిథి పాత్రలో కనిపించనున్నారా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అదే జరిగితే.. చాలా కాలం తర్వాత అక్కినేని.. మెగా హీరోస్ ఇద్దరూ ఒకే స్క్రీన్ పై కనిపించి ఫ్యాన్స్ ను అలరించడం ఖాయంగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రానికి డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించడం విశేషం. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ చిత్రానికి.. ధృవ సినిమాకు ఏదో కనెక్షన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి సినిమాలో ఎలాంటి సర్ ప్రైజ్ ప్లాన్ చేశారో.. ఏజెంట్ మూవీపై ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..