AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటీటీలోకి వచ్చేసిన వెట్రిమారన్‌ ‘విడుదలై పార్ట్‌-1’.. ఆ సీన్లతో కలిపి స్ట్రీమింగ్‌.. ఎందులోనంటే?

మార్చి 31వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సూపర్‌హిట్‌గా నిలిచింది. కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. సినిమా సబ్జెక్టు బాగా నచ్చడంలో అగ్రనిర్మాత అల్లు అరవింద్‌ ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు. ఏప్రిల్‌15న తెలుగునాట విడుదలైన ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చాయి.

ఓటీటీలోకి వచ్చేసిన వెట్రిమారన్‌ 'విడుదలై పార్ట్‌-1'.. ఆ సీన్లతో కలిపి స్ట్రీమింగ్‌.. ఎందులోనంటే?
Viduthalai Part 1 Movie
Basha Shek
|

Updated on: Apr 28, 2023 | 12:01 PM

Share

ఇప్పటివరకు కమెడియన్‌గానే అలరించిన సూరీ కీలక పాత్రలో నటించిన చిత్రం విడుదలై- పార్ట్‌ 1. విచారణై (విచారణ), అసురన్‌, కాకముట్టై తదితర హిట్‌ సినిమాలతో స్టార్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వెట్రిమారన్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. మార్చి 31వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సూపర్‌హిట్‌గా నిలిచింది. కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. సినిమా సబ్జెక్టు బాగా నచ్చడంలో అగ్రనిర్మాత అల్లు అరవింద్‌ ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు. ఏప్రిల్‌15న తెలుగునాట విడుదలైన ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో సూపర్‌హిట్‌గా నిలిచిన విడుదలై పార్ట్‌-1 ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం కేవలం తమిళ్‌ వెర్షన్‌ మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగు వెర్షన్‌ కూడా రిలీజ్‌ కానున్నట్లు సమాచారం.

కాగా విడుదలై పార్ట్‌ 1 ఓటీటీ రిలీజ్ సందర్భంగా ఒక సర్​ప్రైజింగ్ ఇచ్చింది మూవీ టీమ్‌. అదేంటంటే.. ఓటీటీలో డైరెక్టర్స్ కట్ ఎక్స్​టెండెడ్ వెర్షన్​ను స్ట్రీమింగ్ చేయనున్నారు. అంటే, థియేటర్​లో చూడని చాలా సీన్స్​ను ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో చూడవచ్చన్న మాట. ఈ విషయాన్ని తెలియజేస్తూ జీ5 ఒక ట్వీట్ చేసింది. థియేట్రికల్‌ వెర్షన్‌ సుమారు 2గంటల 16 నిమిషాలు ఉండగా.. ఓటీటీ వెర్షన్‌ మాత్రం 2 గంటల 32 నిమిషాలు ఉందని ఈ సినిమా చూసిన వారు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరి థియేటర్లలో విడుదలై పార్ట్‌ 1 ను మిస్‌ అయినవారు ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..