AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pasivadi Pranam: చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ విలన్‌ గుర్తున్నాడా? ఇప్పుడెలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అసలు ఊహించలేరు

ఇదే మూవీలో మాటలు రాని చిన్నారిని అపహరించే కిడ్నాపర్‌ పాత్రలో అందరినీ భయపెట్టాడు ఓ క్రూరమైన విలన్‌. మెగాస్టార్‌ చిరంజీవితో పోటాపోటీగా ఫైట్లు చేసిన ఆ విలన్‌ పేరు బాబు ఆంటోని. తెలుగుతో పాటు మిళ్‌, మలయాళం, హిందీ, కన్నడ.. ఇలా పలు భాషల్లో విలన్‌గా నటించాడు ఆంటోని. తెలుగులో ఎక్కువగా మెగాస్టార్‌ చిరంజీవి సినిమాల్లో కనిపించాడు.

Pasivadi Pranam: చిరంజీవి 'పసివాడి ప్రాణం' విలన్‌ గుర్తున్నాడా? ఇప్పుడెలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అసలు ఊహించలేరు
Pasivadi Pranam
Basha Shek
|

Updated on: Apr 29, 2023 | 5:03 PM

Share

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఆల్‌ టైమ్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ మూవీస్‌లో పసివాడి ప్రాణం ఒకటి. చిరంజీవి ఫేవరెట్ డైరెక్టర్‌ కొండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్‌ గా నటించింది. అలాగే ఈ సినిమాలో మాటలు రాని చిన్నారిగా నటించి ఆకట్టుకుంది సుజిత. ప్రస్తుతం ఆమె టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇదే మూవీలో మాటలు రాని చిన్నారిని అపహరించే కిడ్నాపర్‌ పాత్రలో అందరినీ భయపెట్టాడు ఓ క్రూరమైన విలన్‌. మెగాస్టార్‌ చిరంజీవితో పోటాపోటీగా ఫైట్లు చేసిన ఆ విలన్‌ పేరు బాబు ఆంటోని. తెలుగుతో పాటు మిళ్‌, మలయాళం, హిందీ, కన్నడ.. ఇలా పలు భాషల్లో విలన్‌గా నటించాడు ఆంటోని. తెలుగులో ఎక్కువగా మెగాస్టార్‌ చిరంజీవి సినిమాల్లో కనిపించాడు. త్రినేత్రుడు, జేబుదొంగ, అడవిలో అభిమన్యుడు, లారీ డ్రైవర్‌, శత్రువు, చైతన్య, శాంతిక్రాంతి తదితర హిట్‌ సినిమాల్లో విలనిజం పండించాడు. కండలు తిరిగిన దేహంతో కనిపంచే ఆంథోని అన్ని భాషల్లో కలిపి సుమారు 175కు పైగా సినిమాల్లో నటించాడు.

ప్రస్తుతం ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నప్పటికీ తెలుగులో ఆంథోని కనిపించడం లేదు. అయితే తాజాగా మణిరత్నం పొన్నియన్‌ సెల్వన్‌ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో రాష్ట్రకూటుల రాజుగా ఆంథోని కనిపించాడు. కాగా మార్షల్‌ ఆర్ట్స్‌లో నిపుణుడైన ఆయన స్వయంగా తన పేరు మీదనే మార్షల్‌ ఆర్ట్స్‌లో ట్రైనింగ్‌ స్కూల్స్‌ స్థాపించాడు. దేశంలో పలు నగరాల్లో ఈ స్కూల్‌ ట్రాంచ్‌లు ఉన్నాయి. ఇక ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. బాబు రష్యన్‌ అమెరికన్‌ మహిళ ఇవగెనియాను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఆర్థర్‌ ఆంటోనీ, ఆలెక్స్‌ అంటోనీ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..